News
News
X

ICC T20 WC 2021, IND vs SCO Preview: స్కాట్లాండ్‌తో మ్యాచ్ నేడే.. గెలిచి తీరాల్సిందే!

ICC T20 WC 2021, IND vs SCO: టీ20 వరల్డ్‌కప్‌లో నేటి మ్యాచ్‌లో భారత్, స్కాట్లాండ్‌తో తలపడనుంది.

FOLLOW US: 

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ నేటి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. సెమీస్ బరిలో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిందే.. అయితే స్కాట్లాండ్ గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు దాదాపు షాకిచ్చినంత పని చేసింది కాబట్టి స్కాట్లాండ్‌ని తక్కువ అంచనా వేయకూడదు.

ఇక భారత్ విషయానికి వస్తే.. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలం అయిన బ్యాట్స్‌మెన్, బౌలర్లు.. ఆఫ్ఘనిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌కు దిగిన నలుగురు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. దీంతోపాటు బౌలర్లు కూడా బలమైన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెను కట్టడి చేశారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ గత మ్యాచ్‌తో ఫాంలోకి వచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 140 పరుగులు జోడించి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. అదే సమయంలో వారి తర్వాత వచ్చిన పంత్, పాండ్యా కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. వీరు నాలుగో వికెట్‌కు 22 బంతుల్లోనే 63 పరుగులు జోడించడంతో భారత్ 210 పరుగులు చేయగలిగింది.

ఆ తర్వాత భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేసి కట్టడి చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి స్థానంలో జట్టులోకి వచ్చిన అశ్విన్ అద్భుత బౌలింగ్‌తో తన విలువను ప్రదర్శించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు తీసుకున్నాడు.

అయితే భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడటంతో.. న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడు ఆరు పాయింట్లతో మన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది కాబట్టి.. విజయాలు కూడా భారీగానే సాధించాలి.

Also Read: PAK vs NAM, Match Highlights: సెమీస్ కు పాక్‌.. వరుసగా నాలుగో విక్టరీ! నమీబియాకు హ్యాట్సాఫ్‌.. కాసేపు వణికించారు!

Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ

Also Read: SA vs BANG, Match Highlights: సెమీస్‌ రేసులో సఫారీలు..! బంగ్లా 84కే చిత్తు.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విక్టరీ

Also Read: Ind vs NZ T20 Series: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు.. న్యూజిలాండ్‌ టీ20 సిరీసుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Nov 2021 06:21 PM (IST) Tags: Virat Kohli India ICC T20 WC 2021 Sheikh Zayed Stadium ICC Men's T20 WC Scotland IND vs SCO

సంబంధిత కథనాలు

IND vs ZIM 2022 Squad: టీమ్‌ఇండియాలో మరో మార్పు! సుందర్‌ స్థానంలో వచ్చేది అతడే!

IND vs ZIM 2022 Squad: టీమ్‌ఇండియాలో మరో మార్పు! సుందర్‌ స్థానంలో వచ్చేది అతడే!

Amitabh Chaudhry Passes Away: అమితాబ్‌ చౌదరి కన్నుమూత - బీసీసీఐ సహా క్రికెటర్ల దిగ్భ్రాంతి!

Amitabh Chaudhry Passes Away: అమితాబ్‌ చౌదరి కన్నుమూత - బీసీసీఐ సహా క్రికెటర్ల దిగ్భ్రాంతి!

FIFA Suspends AIFF: బిగ్ షాక్ - భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా

FIFA Suspends AIFF: బిగ్ షాక్ - భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

టాప్ స్టోరీస్

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే -  ప్రభుత్వ జీవో రిలీజ్ !

Ambati Vs Janasena : బపూన్, రంభల రాంబాబు - అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

Ambati Vs Janasena :   బపూన్, రంభల రాంబాబు -  అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!

Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!