Clashes At Guinea Football Match:ఫుట్ బాల్ మ్యాచ్‌లో రిఫరీల పక్షపాత నిర్ణయం- వంద మందికిపైగా మృతి-గినియాలో పెను విషాదం
Clashes At Football match In Guinea: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫరీలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రేక్షకులు తిరగబడ్డారు. ఇది వంద మంది మృతికి కారణమైంది. దీంతో గినియాలో పెను విషాదం చోటు చేసుకుంది.
Clashes At Football Match In Guinea: కోనాక్రీ: పశ్చామాఫ్రికాలోని గినాయా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్సాహంగా ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులలో చాలా మంది విగత జీవులయ్యారు. దేశానికి తూర్పు ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద నగరం ఎన్జెరెకోర్ తొక్కిసలాట జరగడంతో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. నగరంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మైదానంలో ఒక్కసారిగా ప్రజలు ముందుకు కదిలి, తోపులాట చోటు చేసుకందని, అందుకే ఈ ఘోరం జరిగిందని దేశ ప్రధానమంత్రి మామదౌ ఓరీ బాహ్ పేర్కొన్నారు.
మరోవైపు తొక్కిసలాటలో గాయపడిన ప్రజలను స్థానిక అస్పత్రులకు తరలించగా, అక్కడ ఉన్న వార్డులన్నీ నిండిపోయాయి. మరోవైపు మార్చురీలలో శవాలను వరుసగా పడుకోబెట్టిన దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. ప్రస్తుతానికి మరణించిన వారిని గుర్తించలేదని అధికారులు తెలిపారు. నగరంలో యథాతథా స్థితి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
రిఫరీపై కోపంతో..
స్థానిక ఎన్జెరెకోర్ ఫుట్ బాల్ టీంతో లాబీ అనే జట్టు మ్యాచ్ ఆదివారం స్టేడియంలో జరిగింది. అయితే ఆ మ్యాచ్ లో రిఫరీలు పక్షపాతంతో వ్యవహరించి, ప్రత్యర్థి లాబీ జట్టుకు అనుకూలంగా వ్యవహరించారని స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. ఇదే అసలు గొడవకు కారణమైంది. రిఫరీలపై రాళ్లు విసురడంతో పలువురు గాయపడ్డారు.
ఇలా మొదలైన ఘర్షణ తర్వాత అదుపు తప్పింది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో గ్రౌండ్ మధ్యలోకి అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్టేడియంలో లోపల, వెలుపల జనాల తొక్కిసలటకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. హృదయాలను కలిచివేసే దృశ్యాలు అందులో ఉన్నాయి. చాలామంది తొక్కిసలాట నుంచి బయట పడేందుకు పెద్ద పెద్ద గోడలు, ఫ్లోర్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రెసిడెంట్ పై గౌరవార్థంతో..
దేశ అధ్యక్షుడు మామడి దౌబుల్య గౌరవార్థంతో లాబీతో స్థానికంగా ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాటు చేశారని స్థానిక మీడియా తెలిపింది. సెప్టెంబర్ 2021లో తిరుగుబాటుతో మామడి దేశ పగ్గాలు చేపట్టారు. మరోవైపు గతంతో కూడా గినియాలో స్టేడియంలో తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. 2009లో దేశ రాజధాని కోనాక్రీలో జరిగిన ఒక ర్యాలీపై కాల్పులు చోటు చేసుకోవడంతో తొక్కిసలాట జరిగి 156 మంది మరణించారు. గినియా చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనగా రికార్డులకెక్కింది. మరోవైపు గినాయకు సంబంధించి మారణహోమాలకు కారకుడిగా మాజీ మిలిటరీ పాలకుడు మౌస్సా కామారా ఇటీవలే 20 సంవత్సరాల శిక్షను కోర్టు విధించింది.
Also Read: రోహిత్ చేసిన త్యాగానికి... క్రికెట్ ప్రపంచం ఫిదా