అన్వేషించండి

Virat Kohli Instagram: కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాయం.. 274 మిలియన్ల ఫాలోవర్లకు గుడ్‌బై చెప్పాడా?

విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా కనిపించడం లేదని 274 మిలియన్ ఫాలోవర్లు ఆందోళన చెందుతున్నారు. కోహ్లీనే అకౌంట్ తొలగించారా? లేక టెక్నికల్ ప్రాబ్లమా తెలియడం లేదని కామెంట్ చేస్తున్నారు.

Virat Kohli Instagram News | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గురువారం (జనవరి 29న) రాత్రి అకస్మాత్తుగా మాయమైంది. అయితే తాను సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నాను లేదా కొంతకాలం దూరంగా ఉంటున్నాను అని ఎలాంటి పోస్ట్ చేయలేదు. దాంతో విరాట్ కోహ్లీ అభిమానులు ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ మిస్ కావడంపై ఆశ్చర్యపోయారు. క్రికెటర్ కోహ్లీనే తన అకౌంట్ డిలీట్ చేశాడా లేదా ఏదైనా కారణాలతో జరిగిందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల పరంగా చూస్తే క్రికెటర్లలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా కోహ్లీ అభిమానులు అతని ఇన్‌స్టా అకౌంట్ సెర్చ్ చేయగా  ఏమీ కనిపించడం లేదు. అసలేం జరిగింది అని కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. 

విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉంటున్నాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతను టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు. కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ కోసం కోహ్లీ భారతదేశానికి వచ్చాడు, ఆ సిరీస్ ముగిసిన వెంటనే లండన్ తిరిగి వెళ్ళాడు.

కోహ్లీ ఖాతా సస్పెండ్ చేశారా ?

విరాట్ కోహ్లీ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోట్లలో సంపాదిస్తారని తెలిసిందే. దాంతో కోహ్లీ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నాడా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పుడు, ఇద్దరి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం  కారణంగా కనిపంచడం లేదా, లేక వాళ్లే డీయాక్టివేట్ చేసుకున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. త్వరలోనే దీనిపై కోహ్లీ స్పందించి పోస్ట్ చేసే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kunal Khemu Buys New Luxury Mercedes Benz G Class: బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..
బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
IPL 2026 Full List Of Awards: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే.. వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట- పూర్తి జాబితా ఇదే
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే.. వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట- పూర్తి జాబితా ఇదే
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Embed widget