అన్వేషించండి

Virat kohli Future Plans: టెస్ట్ క్రికెట్ కం బ్యాక్, వన్డే వరల్డ్ కప్ అంశాలపై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడా?

Virat Kohli to Play 2027 ODI World Cup | దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేది లేదని స్పష్టం చేశాడు. వన్డేలే తన ఫ్యూచర్ అన్నాడు.న

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌‌ను విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో మొదలుపెట్టాడు. వన్డే కెరీర్ లో కోహ్లీకిది 52వ సెంచరీ. మ్యాచ్ తర్వాత, అతను టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వస్తాడా? అని గత కొంతకాలం నుంచి అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పాడు. 

రాంచీలో జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తర్వాత, కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశాడు. "ఇది ఇలాగే ఉండబోతోంది, నేను ఒకే ఫార్మాట్ ఆడుతున్నాను" అని కోహ్లీ చేసిన ఈ ప్రకటన రన్ మేషిన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటన్నది తేలిపోయింది. 

తన వైఖరిని తెలిపిన కోహ్లీ

రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేసి తన 52వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇప్పటికీ వైట్ బాల్ కింగ్‌ తానేనని మరోసారి నిరూపించాడు. అతని ఇన్నింగ్స్ భారత్‌ను పటిష్ట స్థితికి వెళ్లడంతో పాటు ఉత్కంఠపోరులో విజయాన్ని అందించింది. మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ వస్తారా అని ప్రశ్నించగా, కోహ్లీ ఏమాత్రం సంకోచించకుండా, ఇప్పుడు తన శరీరం, మనసు అవసరాలను అర్థం చేసుకున్నానని, ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ ఫార్మాట్‌లు ఆడటం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. టెస్టుల్లో కం బ్యాక్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశాడు.

తాజా నివేదికలకు చెక్

కొద్ది రోజుల క్రితం, BCCI కొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లను తిరిగి టెస్ట్ జట్టులోకి తిరిగి తీసుకురావాలని యోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఇందులో కోహ్లీ, రోహిత్ పేర్లు ఉన్నాయి. 37 ఏళ్ల వయసులో కోహ్లీ మునుపటిలా అన్ని ఫార్మాట్లలో కొనసాగలేనని భావిస్తున్నాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు తాను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని, తద్వారా ఎనర్జీ నిలుపుకున్నానని చెప్పాడు. తన మనస్సు చురుకుగా ఉన్నంత వరకు, శరీరం ఫిట్‌గా ఉన్నంత వరకు, ఆట మరింత సులభం అనిపిస్తుందని" కోహ్లీ పేర్కొన్నాడు.

'అనుభవమే అతిపెద్ద ఆయుధం'-కోహ్లీ

పిచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు ఈజీ అనిపించిందని, కానీ తర్వాత నెమ్మదించింది. అటువంటి పరిస్థితిలో, అవగాహన, షాట్ సెలక్షన్, అనుభవం చాలా ఉపయోగపడ్డాయి. ప్రాక్టీస్‌పై నమ్మకం ఉంచనని, తన మానసిక బలం, ఆటపై ఉన్న ఇష్టం, డెడికేషన్‌పై నమ్మకం ఉంచుతానని’ కోహ్లీ స్పష్టం చేశాడు. తాను కేవలం వన్డేలు మాత్రమే ఆడాలని భావిస్తున్నట్లు కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక్క ఫార్మాట్లోనే కొనసాగుతున్నట్లు ఇండైరెక్టుగా కోహ్లీ చెప్పకనే చెప్పేశాడు. దాంతో వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ ఆడతాడా అనే ఊహాగానాలకు చెక్ పెట్టాడు.

కోహ్లీ ఇదే ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తే ఈజీగా మరో మూడేళ్లు క్రికెట్ ఆటగలడు. అందులోనూ కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నందున అంతగా ఒత్తిడి, అలసట సైతం అనిపించవు. మధ్యలో ఏడాదికి రెండు నెలలపాటు ఐపీఎల్ సీజన్ తో బిజీగా ఉంటాడు. కనుక వచ్చే వరల్డ్ కప్ కోహ్లీ లక్ష్యమని తేలిపోయింది. తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి 135 పరుగుల శతక భాగస్వామ్యం భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టింది. కోహ్లీ సెంచరీ అయితే మరో లెవల్ అనిపించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget