Kohli Video Call To RCB Team : బెంగళూరు విమెన్ ప్లేయర్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన విరాట్ కోహ్లీ
WPL 2024: WPL 2024 గెలిచిన ఆర్సీబీ ఉమెన్ క్రికెటర్స్‌కు కింగ్ కోహ్లీ సర్‌ప్రైజ్ చేశాడు. వీడియో కాల్ చేసి టీమ్‌తో మాట్లాడారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు.
RCB News: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విమెన్ ప్రీమియర్ లీగ్ - WPL 2024 విజేతగా ఆవిర్భవించింది. ఆదివారం న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టును చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో బెంగళూరు ఈ విక్టరీ పట్ల స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తించారు. మహిళా క్రికెటర్లు సంబరాలు చేసుకొన్నారు. ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకొంది.
ఢిల్లీ జట్టు తో ఫైనల్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన స్మృతి మంధాన సేన ఫైనల్ మ్యాచ్‌ని ఏకపక్షం చేసేసింది. మొదటినుంచి మ్యాచ్ ని తన చేతుల్లోనే ఉంచుకొంది. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్‌లోనూ ఢిల్లీని ఏమాత్రం లెక్కచేయలేదు. 19 ఓవర్ 3వ బంతికి బెంగళూరు ప్లేయర్ రిచాఘోష్ బౌండరీ బాది జట్టును విజయాతీరాలకు చేర్చగానే ఆర్సీబీ ప్లేయర్లు గ్రౌండ్‌లోకివచ్చి సంబరాలు చేసుకొన్నారు. వీరితో పాటు కెప్టెన్ స్మృతిమంధాన కూడా పరుగెత్తుకొచ్చి సంబరాలు చేసుకొంది. అప్పుడే స్మృతి ఫోన్‌కి వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరోకాదు... స్టార్ బ్యాట్స్‌మెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.
మ్యాచ్ ముగియగానే బెంగళూరు మహిళా క్రికెటర్లు గ్రౌండ్‌లోకి చేరగానే స్మృతికి ఫోన్ చేసిన విరాట్‌కోహ్లీ... అభినందనలు తెలిపాడు. చాలా అద్భుతంగా ఆడారని. సమష్టిగా ఆడి బెంగళూరుని విజేతగా నిలిపారని... జట్టు మొత్తానికి అభినందనలు అని చెప్పాడు. జట్టు ఇతర సభ్యులతో కూడా కాసేపు మాట్లాడాడు. దీంతో విమెన్ క్రికెటర్లు ఖుషీ అయ్యారు. తమ అభిమాన ఆటగాడు కాల్ చేసి అభినందించడంతో కప్ విజయానందం రెట్టింపయ్యింది మహిళా క్రికెటర్లకి. ఈ విజయంతో కొంతమంది మహిళా క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకొన్నారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత బెంగళూరు ఫ్రాంఛైజీ టెటిల్ సాధించింది. ఇప్పటివరకు అటు ఐపీయల్ కానీ, ఇటు డబ్యూపీయల్ లో కానీ టెటిల్ గెలవలేదు. ముఖ్యంగా ఎన్నో అంచనాలతో బరిలో దిగే పురుషుల జట్టు ప్రతీసారీ నామమత్రం ప్రదర్శనే చేసేది. స్టార్‌ప్లేయర్లు ఉన్నప్పటికీ కప్ గెలవవలేదు అని అసంతృప్తి ఉండేది. కానీ మహిళల జట్టు ఆ లోటు తీర్చడంతో బెంగళూరు ఫ్యాన్స్ మాత్రమే కాదు... విరాట్‌కోహ్లీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్‌విమెన్ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతే కాక బెంగళూరు విమెన్ ప్లేయర్లకి కాల్ చేసి ఆ ఆనందాన్ని తనూ పంచుకొన్నాడు.
ఇక ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ RCB విజయంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వెన్నువిరిచి ఆ జట్టు 113 పరుగులకే పరిమితమయ్యేలా చేసింది. దీంతో బెంగళూరు జట్టు 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది.ఎలీస్ పెర్రీ 35 నాటౌట్, రిషా ఘోష్ 17 పరుగులతో ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేశారు. మొదట్లో కెప్టెన్ స్మృతి మంధానా 31 పరుగులు, సోఫీ డివైన్ 32 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ జట్టు 7 గురు బౌలర్లని ప్రయోగించినా ఫలితం లేకపోయింది. RCB కేవలం 2 వికెట్లే కోల్పోయి టైటిల్ సాధించింది.
ఇక రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టుతో కోహ్లీ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో, ఫోటోలని సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే దీని గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంత మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా పురుషుల జట్టు టైటిల్ గెలవలేకపోయింది. కానీ మహిళా జట్టు గ్రేట్, శభాష్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే, కింగ్ కోహ్లీ టైటిల్ పై ఎంత ప్రేమపెంచుకొన్నాడో దీన్ని బట్టి అర్ధమవుతోంది... ఏది ఏమైనా
ఈ విజయం ఇచ్చే స్పూర్తితో అయినా ఐపీయల్లో పురుషుల జట్టు ఛాంపియన్ గా నిలవాలి అని మరికొంతమంది అంటున్నారు.