Tilak Varma T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్‌ను వెనక్కి నెట్టి మరీ!
ICC T20I Rankings | ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో తెలుగు తేజం తిలక్ వర్మ 69 స్థానాలు మెరుగు పరుచుకుని మూడో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను వెనక్కి నెట్టాడు.
Tilak Varma becomes highest ranked Indian T20I batter | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ సత్తా చాటాడు. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి చేరాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు శతకాలతో దుమ్మురేపిన తిలక్ వర్మ తొలిసారి టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. భారత్ నుంచి మెరుగైన ర్యాంక్ లో నిలిచిన ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు.
ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన T20I సిరీస్‌లో మూడు, నాలుగో టీ20లో సెంచరీలతో విశ్వరూపం చూపిన తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు మెరుగు పరుచుకున్నాడు. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మ తాజా ర్యాంకింగ్స్ లో ఊహించని రీతిలో ఎగబాకాడు.
A return to No.1 for one of India's best in the latest T20I Rankings 👊https://t.co/NpVQN2k53C
— ICC (@ICC) November 20, 2024
నెంబర్ వన్ ఆల్ రౌండర్ పాండ్యా
భారత టీ20 మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నెంబర్ 1 ఆల్ రౌండర్‌గా మళ్లీ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్, నేపాల్ డైనమో దీపేంద్ర సింగ్ ఐరీలను అధిగమించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ పాండ్యా టీ20 ఆల్ రౌండర్ అయ్యాడు. అతడు బ్యాటుతో పాటు బంతితోనూ అతడు మెరుగ్గా రాణించాడు.
మెరుగైన శాంసన్, పాండ్యా ర్యాంకులు
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ లో 39 నాటౌట్ తో పాటు నాలుగో మ్యాచ్‌లో 3 ఓవర్లలో 1/8తో రాణించాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో రాణించిన తరువాత తాజాగా మరోసారి హార్ధిక్ పాండ్యా టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ అయ్యాడు. ఆల్ రౌండర్లలో పాండ్యా ఒక్కటే టాప్ 10లో నిలిచాడు. తిలక్ వర్మ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో 2 శతకాలు సాధించి 280 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా అద్భుతం చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన సంజూ శాంసన్ T20I బ్యాటర్లలో 17 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంక్‌కు ఎగబాకాడు. సఫారీల నుంచి ట్రిస్టన్ స్టబ్స్ 3 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌కి చేరగా, డాషింగ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 6 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరాడు.
ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా, నాథన్ ఎల్లిస్ టీ20 ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉన్నారు. ఆర్షదీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి 9వ స్థానం, కెరీర్ బెస్ట్ ర్యాంక్ చేరుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో రాణించిన మహీష్ తీక్షణ 6 స్థానాలు మెరుగు చేసుకుని 6వ స్థానంలో ఉన్నాడు. మూడు మ్యాచ్ లలో 5 వికెట్లు తీశాడు.