అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువసార్లు 250 అంతకంటే ఎక్కువ స్కోర్లను సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 3 సార్లు టీమిండియా ఈ ఫీట్ సాధించింది.
Image Source: BCCI
విదేశాలలో భారత జట్టుకు అత్యధిక స్కోరు 283/1 ఇదే. టీ20ల్లో టీమిండియాకు రెండో హయ్యస్ట్ స్కోర్.
Image Source: BCCI
టీ20ల్లో వరుసగా 2 సెంచీరలు చేసిన రెండో భారత బ్యాటర్ తిలక్ వర్మ. తొలి బ్యాటర్ సంజూ శాంసన్ కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 5వ క్రికెటర్ తిలక్.
Image Source: BCCI
ఒకే క్యాలెండర్ ఏడాదిలో టీ20ల్లో 3 సెంచరీలు బాదిన తొలి ఆటగాడు సంజూ శాంసన్. ఈ ఏడాది 3 శతకాలు సాధించాడు.
Image Source: BCCI
భారత్ తరఫున ఓ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం 210 పరుగులు చేసిన తొలి జోడీగా శాంసన్, తిలక్ వర్మ నిలిచారు. రోహిత్ శర్మ, రింకు సింగ్ 5వ వికెట్‌కు 190 పరుగులు రెండో అత్యధిక భాగస్వామయ్యంగా మారింది.
Image Source: BCCI
ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో 4 సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. అది కూడా ఇద్దరు బ్యాటర్లు సంజూ శాంసన్, తిలక్ వర్మ చెరో రెండు సెంచరీలు చేశారు
Image Source: BCCI
సంజూ శాంసన్, తిలక్ వర్మ అజేయ శతకాలతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాపై భారత్ 135 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
Image Source: BCCI
ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో భారత్ అత్యధికంగా 23 సిక్సర్లు నమోదు చేసింది. 27 సిక్సర్లతో జింబాబ్వే నెంబర్ వన్.