ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా? - అసలేం జరుగుతుంది? 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ ఈ ట్రోఫీలో పాల్గొంటుందా? లేదా? అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు... పాకిస్తాన్ రాలేదని బీసీసీఐ తెలిపింది. తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పీసీబీ సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ లేదా యూఏఈలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదన పెట్టిందని టాక్. ఒకవేళ పీసీబీ ఒప్పుకోకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే అవకాశం లేదు. మరి తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.