కాటేరమ్మ కొడుకులను కాపాడుకున్న కావ్య మారన్ - సన్‌రైజర్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే! 1. హెన్రిచ్ క్లాసెన్ - రూ.23 కోట్లు ఐపీఎల్ 2024లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన హెన్రిచ్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.23 కోట్లతో రిటైన్ చేసుకుంది. 2. ప్యాట్ కమిన్స్ - రూ.18 కోట్లు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్‌ను రూ.18 కోట్లతో రిటైన్ చేసుకుంది. 3. ట్రావిస్ హెడ్ - రూ.14 కోట్లు విధ్వంసకర ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను రూ.14 కోట్లతో రిటైన్ చేసుకుంది. 4. అభిషేక్ శర్మ - రూ.14 కోట్లు భయంకరమైన ఆట ఆడే భారతీయ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రూ.13 కోట్లతో రిటైన్ చేసుకుంది. 5. నితీష్ కుమార్ రెడ్డి - రూ.8 కోట్లు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని రూ.8 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇంకా వారి దగ్గర వేలం కోసం రూ.45 కోట్లు ఉన్నాయి.