అందంలోనే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా మహిళల జట్టు అగ్రస్థానంలో ఉంది. వీరి దూకుడైన ఆటతీరు.. ప్రత్యర్థులు భయపడేలా ఉంటుంది. ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ జట్టు ఇప్పటి వరకు 79 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 22 గెలిచింది, 11 ఓడి, 46 మ్యాచులు డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు 367 వన్డే మ్యాచ్‌లు ఆడి, 291 మ్యాచుల్లో గెలిచింది. 67 మ్యాచుల్లో ఓడి, 2 మ్యాచులు డ్రా చేసుకుంది. ఏడు మ్యాచులు రద్దు. 188 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 128 గెలిచి, 51 ఓడిపోయింది, 4 మ్యాచులు టై ,5 మ్యాచ్‌లు రద్దు. ఆస్ట్రేలియా మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను ఆరు సార్లు, టీ20 ప్రపంచకప్‌ను ఆరుసార్లు గెలుచుకుంది.