India Cricket Schedule: స్వదేశంలో టీమిండియా షెడ్యూల్ ఇదే - భాగ్యనగరం, వైజాగ్‌లో ఓ టెస్టు, టీ20 మ్యాచ్
భారత క్రికెట్ జట్టు 2023 - 24లో స్వదేశంలో ఆడబోయే సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసంది.
India Cricket Schedule: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు.. 2023-24 సీజన్‌కు గాను స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ - నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి ముందు ఆ తర్వాత వచ్చే సిరీస్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది వరకూ భారత జట్టు స్వదేశంలో ఐదు టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ.. షెడ్యూల్‌తో పాటు వేదికలు, టైమింగ్స్‌ను కూడా విడుదల చేసింది. కాగా ఈ సీజన్‌లో హైదరాబాద్ కూడా రెండు కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్, ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఇక్కడే జరుగనుంది. వైజాగ్‌లో కూడా ఒక టీ20, ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు జరుగనుండటం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేదే.
వన్డే వరల్డ్ కప్‌నకు ముందు మెన్ ఇన్ బ్లూ.. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఇది ముగిసిన వెంటనే వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచకప్ ముగిశాక మళ్లీ ఆస్ట్రేలియాతోనే ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ డిసెంబర్ వరకూ సాగుతోంది. అంటే సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చే ఆస్ట్రేలియా జట్టు డిసెంబర్ వరకూ ఇక్కడే ఉండనుంది.
డిసెంబర్-జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టు.. అక్కడ్నుంచి తిరిగొచ్చాక అఫ్గానిస్తాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇది అయిపోయాక జనవరి 24 నుంచే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల మెగా సిరీస్ జరగనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ఆస్ట్రేలియాతో 3 వన్డేలు
- సెప్టెంబర్ 22 : ఫస్ట్ వన్డే - మొహాలీ
- సెప్టెంబర్ 24 : సెకండ్ వన్డే - ఇండోర్
- సెప్టెంబర్ 27 : థర్డ్ వన్డే - రాజ్‌కోట్
ఈ మ్యాచ్‌లు అన్నీ మధ్యాహ్నం 1.30 గంటకు మొదలవుతాయి.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20లు
- నవంబర్ 23 : తొలి టీ20 - వైజాగ్
- నవంబర్ 26 : రెండో టీ20 - త్రివేండ్రం
- నవంబర్ 28 : మూడో టీ20 - గువహతి
- డిసెంబర్ 01 : నాలుగో టీ20 - నాగ్‌పూర్
- డిసెంబర్ 03 : ఐదో టీ20 - హైదరాబాద్
ఈ మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు మొదలవుతాయి.
డిసెంబర్ - జనవరిలో భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది.
అఫ్గానిస్తాన్‌తో మూడు టీ20లు.. (2024 జనవరిలో)
- జనవరి 11 : తొలి టీ20 - మొహాలీ
- జనవరి 14 : రెండో టీ20 - ఇండోర్
- జనవరి 17 : మూడో టీ20 - బెంగళూరు
NEWS - BCCI announces fixtures for International Home Season 2023-24.
— BCCI (@BCCI) July 25, 2023
The Senior Men's team is scheduled to play a total of 16 International matches, comprising 5 Tests, 3 ODIs, and 8 T20Is.
More details here - https://t.co/Uskp0H4ZZR #TeamIndia pic.twitter.com/7ZUOwcM4fI
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు..
- జనవరి 25 - 29 : ఫస్ట్ టెస్ట్ - హైదరాబాద్
- ఫిబ్రవరి 2 - 6 : సెకండ్ టెస్ట్ - వైజాగ్
- ఫిబ్రవరి 15 - 19 : థర్డ్ టెస్ట్ - రాజ్‌కోట్
- ఫిబ్రవరి 23 - 27 : ఫోర్త్ టెస్ట్ - రాంచీ
- మార్చి 7 - 11 : ఫిఫ్త్ టెస్ట్ - ధర్మశాల
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial