T20 world cup Records: టీ 20 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్, విండీస్ పేరు మీద ఉన్న చెత్త రికార్డులివే
T20 World Cup Records: టీ 20 వరల్డ్ కప్ లో ఈ రికార్డుల గురించి మీకు తెలుసా.? ఒక మ్యాచ్ లో అత్యల్పంగా ఎన్ని రన్స్ స్కోరయ్యాయో ఇక్కడ చదవండి.
T20 World Cup Records: టీ 20 ప్రపంచ కప్ జూన్ రెండు నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జరిగిన టీ 20 ప్రపంచ కప్ మ్యాచుల్లో 2 ఇన్నింగ్సుల్లో కలిపి నమోదైన అతి తక్కువ టోటల్స్ ఏవి? అవి ఏ సీజన్లో ఏ ఏ టీముల మధ్య జరిగిన మ్యాచ్‌లలో నమోదయ్యాయి? వాటిలోని వ్యక్తి గత స్కోర్ల వివరాలేంటి? వాటి ఫలితాల సంగతేంటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటి వరకు ఎనిమిది ఎడిషన్ల పాటు జరిగిన ఈ టీ 20 వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ లో రెండు టీమ్ ల స్కోర్లు కలిపి అతి తక్కువ రన్స్ నమోదైన సందర్భాలు చాలానే ఉన్నాయి. రెండు టీమ్‌ల స్కోర్లూ కలిపి వంద లోపే నమోదైన సందర్భాలు రెండు ఉండగా, 120 కంటే తక్కువ స్కోర్లు నమోదైన సందర్భాలు 5 ఉన్నాయి. 8 సందర్భాల్లో 150 కంటే తక్కువస్కోర్లు నమోదయ్యాయి. 200 కంటే తక్కువ స్కోర్లు నమోదైన సందర్భాలు 17 ఉండగా, 47 సందర్భాల్లో రెండు టీముల స్కోర్లు కలిపి 240 పరుగులు దాటలేదు.
79 పరుగులు.. ఇది ఒక్క టీమ్ స్కోర్ కాదు..
లోయెస్ట్ టోటల్ అనే పదానికి అర్థం చెప్పిన మ్యాచ్ అది. క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ 2014 టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా శ్రీలంకతో భారీ పరాభవాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10.3 ఓవర్లలో 39 పరుగులకే ఆలౌటైంది. టీమ్ ఆటగాడు టామ్ కూపర్ తప్ప మిగిలిన వాళ్లెవ్వరూ రెండంకెల స్కోరు దాటలేదు. కూపర్ కూడా చేసింది కేవలం 16 పరురులే. 40 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో 16 పరుగులకే మూడు వికెట్లు తీసిన ఆంజెలో మథ్యూస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.
మళ్లీ అవే జట్లు ఈ సారి 89
2021 టీ 20 వరల్డ్ కప్ లో సైతం నెదర్లాండ్స్ శ్రీలంకతో ఈ తరహా ఆటతీరే కనబరిచింది. కేవలం 10 ఓవర్లలోనే 44 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు..11 కొలిన్ ఏకర్‌మాన్ పేరిట నమోదైంది. 7,2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి శ్రీలంగ ఈ స్కోర్ ని ఛేజ్ చేసింది ఏడు పరుగులకే మూడు వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ లహిరు కుమార ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
రెండూ పెద్ద టీములే
వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు ఆడుతోంటే ఎవరైనా హై స్కోరింగ్ మ్యాచ్ ఆశిస్తారు. కానీ 2021 టీ 20 ప్రపంచ కప్ 14 వ మ్యాచ్‌లో అందుకు భిన్నంగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 14,2 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. క్రిస్ గేల్ (13) మినహా విండీస్ ప్లేయర్లెవ్వరూ రెండంకెల స్కోరుకు చేరుకోలేకపోయారు. 56 పరుగుల చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సైతం లక్ష్య ఛేదనలోొ తడబడింది. 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఈ స్వల్స లక్ష్యాన్ని ఛేదించింది.