Shreyas Iyer : బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer -Shraddha Kapoor: టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో రహస్య డేటింగ్ చేస్తున్నట్లు క్రికెట్, బాలీవుడ్ వర్గాల్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Shraddha Kapoor And Shreyas Iyer: ఆడినా, ఆడకపోయినా గతకొంతకాలంగా టీమ్ఇండియా మిడిల్ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలం కావడంతో అతడిపై వేటు పడింది. రంజీ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున ఆడాలని బీసీసీఐ(BCCI) కోరగా ఫిట్‌నెస్‌తో లేనని తెలిపాడు. వెన్నుగాయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతడు ఫిట్‌గానే ఉన్నాడని ఎన్‌సీఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో సమస్య మొదలైంది. బీసీసీఐ మాట పెడచెవిన పెడుతూ ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా జట్టుతో చేరి అయ్యర్ ప్రాక్టీస్ చేశాడు. గాయాన్ని కారణంగా చూపి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో అతడిపై వేటు పడింది. BCCI శ్రేయస్ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది.
బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెమీఫైనల్లో తమిళనాడుతో తలపడే జట్టులోకి అయ్యర్‌ను ముంబై సెలక్టర్లుఎంపిక చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై తరపున బరిలోకి దిగిన అయ్యర్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. 8 బంతుల్లో 3 రన్స్ చేశాడు. అనంతరం వారియర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ క్లీన్ బౌల్డయ్యాడు.
శ్రేయస్ అయ్యర్.. శ్రద్ధా కపూర్..
ఇలా మొన్నటి వరకు కెరీర్ పరంగా వార్తల్లో నిలిచిన అయ్యర్ ప్రస్తుతం వ్యక్తిగత విషయాల్లోనూ తెరపైకి వచ్చాడు. అతడు ప్రేమలో పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో మొదలైన స్నేహం ప్రేమగా మారిందన్నది ఆ వార్తల సారాంశం. ఇక శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సాహోలో హీరోయిన్‌గా నటించింది. కాగా.. శ్రేయస్ అయ్యర్, శ్రద్ధాలు ప్రేమలో పడినట్లు వార్తలు రావడానికి ఓ కారణం ఉంది. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఒకరి సోషల్ మీడియా ఖాతాలను మరొకరు ఫాలో కావడంతో ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే..ఈ వార్తలపై ఇంతవరకు అటు శ్రేయస్ అయ్యర్ గానీ, ఇటు శ్రద్ధా గానీ స్పందించలేదు. కాగా.. వీరిద్దరు కలిసి బయట తిరిగిన దాఖలాలు లేవు. దీంతో ఇది ఓ రూమర్ మాత్రమేనని కొంత మంది నెటిజన్లు అంటున్నారు.
బీసీసీఐ కొత్త నిబంధన
భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని ఇషాన్, వెన్నునొప్పితో రంజీ ఆడని ఆయ్యర్‌పై బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్ ఆగ్రహంగా ఉంది. దేశవాళీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. ఈ అల్టీమేటంతో అయ్యర్ దారిలోకి వచ్చాడు.