AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
సైరా బాను విడాకుల ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే రెహమాన్ అసిస్టెంట్ మోహిని తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెహమాన్, మోహిని మధ్య ఏదో ఉదంటూ ఊహాగానాలు వచ్చాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన సతీమణి సైరా బాను ప్రకటించింది. సంసార జీవితంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు సైరా బాను న్యాయవాది వందన వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అదే రోజు రెహమాన్ అసిస్టెంట్ అయిన మోహిని డే కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెహమాన్ కు, మోహినికి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలపై తాజాగా సైరా బాను న్యాయవాది వందనా షా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
ఆ వార్తలన్నీ అవాస్తవాలే- లాయర్ వందన
రెహమాన్, మోహని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సైరాబాను న్యాయవాది వందన తోసిపుచ్చారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనన్నారు. “ రెహమాన్ విడకులకు, ఆయన అసిస్టెంట్ విడాకులకు ఎలాంటి సంబంధం లేదు. సైరా, రెహమాన్ సొంతంగా విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. మరో వ్యక్తి కారణంగా ఈ విడాకులు తీసుకోవడం లేదు. అనవసర చర్చ అవసరం లేదు” అని చెప్పుకొచ్చారు. రెహమాన్, మోహిని మధ్య ఏదో సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.
ఎవరీ మోహిని డే?
మోహిని, కోల్‌కతాకు చెందిన బాస్ ప్లేయర్. ఆమె రెహమాన్ టీమ్ తో కలిసి పని చేస్తున్నది. రెహమాన్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 ప్రదర్శనలు ఇచ్చింది. రెహమాన్ విడాకుల ప్రకటన వచ్చిన రోజునే, ఆమె కూడా తన భర్త మార్క్ హార్ట్ సుచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా తన విడాకుల ప్రకటన చేసింది. ఇకపై ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇద్దరు కలిసి పరస్పరం విడాకులు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రెహమాన్, ఆయన అసిస్టెంట్ ఒకేసారి విడాకులు ప్రకటనలు చేయడంతో ఇద్దరికి లింక్ చేస్తూ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వార్తలు రాసింది. మరికొన్ని వెబ్ సైట్లు ఏకంగా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వండి వడ్డించాయి. తాజాగా సైరా బాను న్యాయవాది వందనా షా క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పండింది.
29 ఏండ్ల తర్వాత వివాహ బంధానికి స్వస్తి
రెహమాన్, సైరా బాను 29 ఏండ్ల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. 1995లో పెద్దలు వీరిద్దరి వివాహం చేశారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 19న రెహమాన్ సతీమణి సైరా బాను తన భర్తతో విడిపోతున్నట్లు సంచలన విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన విని అందూ షాక్ అయ్యారు. ఆ తర్వాత రెహమాన్ కూడా విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు వెల్లడించారు.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే