Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్ అదానీ
Adani Group News: సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు $250 మిలియన్ల లంచం ఇవ్వజూపిన కేసులో గౌతమ్ అదానీ సహా ఏడుగురు అధికారుల పాత్రపై US కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి.
Adani Group Cancels 600 Million Dollars Bond Offering: భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందేందుకు $250 మిలియన్ల లంచం ఇవ్వజూపడం, తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు వంటి ఆరోపణలతో ఈ రోజు (గురువారం, 21 నవంబర్ 2024) అదానీ గ్రూప్ షేర్లు విలవిల్లాడాయి. గ్రూప్ స్టాక్స్ 10 శాతం నుంచి 20 శాతం వరకు పతనమయ్యాయి. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ సహా ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు $250 మిలియన్ల లంచం పథకాన్ని రూపొందించారని యుఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలతో గ్రూప్ షేర్లలో ఈ పతనం కొనసాగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, తమ $600 మిలియన్ల బాండ్ ఆఫర్‌ను రద్దు చేసినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (Adani Green Energy Ltd) ప్రకటించింది.
యుఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, అదానీ గ్రీన్ ఎనర్జీ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. "మా బోర్డు సభ్యులైన గౌతమ్ అదానీ మరియు సాగర్ అదానీకి వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వరుసగా యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో క్రిమినల్ నేరారోపణలు చేశాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మా బోర్డు సభ్యుడు వినీత్ జైన్‌ను కూడా ఆ నేరారోపణలో చేర్చింది. ఈ పరిణామాల దృష్ట్యా, మా అనుబంధ సంస్థలు ప్రతిపాదిత డాలర్-డినామినేటెడ్ బాండ్ ఆఫర్‌లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాయి".
US prosecutors charge Gautam Adani and others in alleged Solar Energy contract bribery case
— ANI (@ANI) November 21, 2024
Adani Green says, "The United States Department of Justice and the United States Securities and Exchange Commission have issued a criminal indictment and brought a civil complaint,… pic.twitter.com/uoBDJPuhOE
రూ.2,100 కోట్ల లంచం ఆరోపణలు
బ్రూక్లిన్ కోర్టులో దాఖలు చేసిన అభియోగాల ప్రకారం, భారతదేశంలో సౌరశక్తి కాంట్రాక్టులను పొందేందుకు 250 మిలియన్ డాలర్ల (రూ. 2,100 కోట్లు) లంచం ఇవ్వజూపిన పథకంలో సూత్రధారిగా గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్‌తో పాటు మరో నలుగురు (మొత్తం ఏడుగురు) అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నిందితులు US పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు జారీ చేశారని, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారని ఆ అభియోగపత్రంలో ఉంది.
Also Read: గౌతమ్ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం బిలియన్ల కొద్దీ నిధులు సమకూర్చిన US బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూప్ ఈ సమాచారాన్ని దాచిపెట్టిందని US ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఎనర్జీ కాంట్రాక్టులను దక్కించుకోవడం ద్వారా $2 బిలియన్ల లాభాలను ఆర్జించాలని ఈ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.
2023లో USకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) విడుదల చేసిన రిపోర్ట్‌లోనూ లంచం ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చాలా గట్టి ఆరోపణలు చేసింది. ఆ రిపోర్ట్ బయటకు వచ్చాక, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ సుమారు $150 బిలియన్లు తగ్గింది.
ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సహా కీలక కంపెనీల షేర్లు అతి భారీగా 20 శాతం వరకు నష్టపోయాయి.
మరో ఆసక్తికర కథనం: అమెరికా కేసు ఎఫెక్ట్- అదానీ గ్రూప్ షేర్లు క్రాష్