Gautam Adani Charged In New York: గౌతమ్ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
Gautam Adani: సోలార్ పవర్ ప్లాంట్ కోసం లంచాలు ఇచ్చారని అదానీ సహా మరో ఏడుగురిపై అమెరికా అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2 బిలియన్ల లాభాల కోసం ఈ పని చేశారని అభియోగాలు మోపింది.
![Gautam Adani Charged In New York: గౌతమ్ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం gautam adani and his nephew Sagar Adani Charged by US Over Alleged 250 Million dollars Bribe Plot Gautam Adani Charged In New York: గౌతమ్ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/21/56e98ddb4c3cb9fe0198c343bd5626231732160420548215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gautam Adani News Today: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికా షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు కోసం లంచం ఇచ్చారని అభియోగాలు మోపుతూ ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ పొందేందుకు అధికారులకు లంచాలు ఇచ్చారని యుఎస్ ప్రాసిక్యూటర్‌లు వెల్లడించారు.
అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతోపాటు మరో ఏడుగురు ఈ స్కామ్‌లో భాగమైనట్టు అమెరికా పేర్కొంది. 20 సంవత్సరాల్లో 2 బిలియన్ డాలర్ల లాభం పొందే కాంట్రాక్టు కోసం లంచాలు ఇచ్చారని అభియోగాలు మోపింది. సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకు అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించారని తెలిపారు.
అదానీ ఫ్యామిలీ, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన ఎగ్జిక్యూటివ్, మాజీ CEO వినీత్ జైన్ తమ అవినీతిని దాచి పెట్టి రుణాలు, బాండ్ల ద్వారా 3 బిలియన్ డాలర్లకుపైగా నిధులు సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని "న్యూమెరో యునో" అండ్ "పెద్ద మనిషి" అనే కోడ్ పేర్లతో ప్రైవేట్‌గా ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు సాగర్ అదానీ తన సెల్‌ఫోన్‌ను ఉపయోగించారని ఆరోపించారు.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, జైన్‌పై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్‌కు కుట్రకు తెరతీసారని, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు మోపారు. US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో కూడా అదానీలపై అభియోగాలు మోపారు. ఇతర ఐదుగురు నిందితులపై ఫారిన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్, అమెరికా లంచ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారని, లా ప్రొసీడింగ్స్ అడ్డుకునేందుకు కుట్ర పన్నారని నలుగురిపై అభియోగాలు మోపారు. నిందితులు ఎవరూ కస్టడీలో లేరని బ్రూక్లిన్‌లోని యుఎస్ అటార్నీ బ్రీన్ పీస్ ప్రతినిధి తెలిపారు.
కోర్టు రికార్డుల ప్రకారం... గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. న్యాయవాదులు ఆ వారెంట్లను ఫారెన్ లా ఎన్‌ఫోర్స్‌మంెట్‌కు అప్పగించాలని యోచిస్తున్నారు. అదానీ 20 ఏళ్ల "గ్రీన్" బాండ్లు విక్రయించి 600 మిలియన్ డాలర్లు సేకరించిన కొన్ని గంటల తర్వాత ఈ అభియోగాలు మోపారు.
US ఎనర్జీ సెక్యూరిటీ, మౌలిక సదుపాయల ప్రాజెక్టుల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు Xలో అదానీ గత వారం పోస్టు చేశారు. దీని ద్వారా 15,000 ఉద్యోగాలు సృష్టించవచ్చన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూనే ఈ పెట్టుబడి ప్రకటన చేశారు. ఎనర్జీ కంపెనీలు అమెరికా వచ్చి పని చేసేందుకు వ్యవస్థను సులభతరం చేస్తామని ట్రంప్ రిప్లై ఇచ్చారు.
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం అదానీ ఆస్తుల విలువ 69.8 బిలియన్ల డాలర్లు. ఆయన ప్రపంచంలోని 22వ అత్యంత సంపన్న వ్యక్తి. ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్ ముఖేష్ అంబానీ తర్వాత రెండో ధనవంతుడు. యునైటెడ్ స్టేట్స్‌లో అధికారికంగా నేరారోపణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిలియనీర్‌ల్లో ఒకరు.
అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని రెండు సంవత్సరాల క్రితం US షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. దీన్ని తప్పుపట్టిన అదానీ గ్రూప్ కేసులు కూడా వేసింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా అదానీ గ్రూప్ సుమారు 150 బిలియన్ డాలర్లు సంపద కోల్పోవాల్సి వచ్చింది. ఆ సంస్థపై ఇప్పుడు మరో పిడుగు పడింది.
Also Read: అంబానీని మించి సంపాదించిన అదానీ - నంబర్ 1 ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)