అన్వేషించండి

Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!

Rohit Sharma Statement: వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే ఓటమి నిరాశకు గురిచేసిందన్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ ఖండించి, క్లారిటీ ఇచ్చింది.
  • లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై రోహిత్ చారిత్రక 138 పరుగులు చేశాడు.
  • రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చాడు; ఆటపైనే దృష్టి.

Rohit Sharma Retirement News | ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డే తర్వాత భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ అతడికి ముందే చెప్పిందని, దాంతో హిట్ మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 ప్రాబబుల్స్ లో కూడా ఉండడని చర్చ జరిగింది. కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం రోహిత్ శర్మతో మాట్లాడటం పూర్తయిందని.. రిటైర్మెంట్ ప్రకటించడమా.. లేక వన్డే వరల్డ్ కప్ రేసులో లేడని తేలిపోవడమో జరగుతుందని అంతా అనుకున్నారు. తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ వార్తలు వింటూనే ఉన్నానని, వారిని మనం అడ్డుకోలేం అని.. స్టేడియం బయట కొందరికి చాలా మజాగా ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

ఆ తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా ఈ వార్తలను ఇదివరకే ఖండించారు. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో రోహిత్ భాగం అవుతారా లేదా అనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై రోహిత్ శర్మ తొలిసారి స్పందించారు. లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో, చివరి వన్డే ముగిసిన తర్వాత రోహిత్ తనపై వచ్చిన వదంతులపై తనదైన శైలిలో స్పందించాడు. 

లార్డ్స్ స్టేడియంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ (138 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్) సాధించాడు. లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. భారత ఓపెనర్ రోహిత్ 110 బంతుల్లో 5 సిక్సర్లు, 17 ఫోర్లు బాది స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీతో కలిసి కూడా శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. అయితే భారత్ ఈ మ్యాచ్‌లో చివరివరకూ పోరాడి ఓడిపోయింది. 

Also Read: Most Expensive Bowler: వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు

రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘మేం బర్మింగ్‌హామ్‌లో విజయంతో మంచి ప్రారంభాన్ని అందుకున్నాం. కానీ రెండో వన్డే జరిగిన కార్డిఫ్‌లో ఓడిపోయాం. ఈ రోజు బ్యాటింగ్‌లో మంచి ఆరంభం లభించడంతో విజయంపై ఆశలు పెట్టుకున్నాం. చివరివరకూ పోరాడి మళ్లీ ఓడిపోయామని’ అన్నాడు.

రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ రియాక్షన్..

‘నాకు తెలిసిన పని బాగా బ్యాటింగ్ చేయడం. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం. నేను అరంగేట్రం చేసినప్పటి నుండి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. భారత్‌కు ఆడుతున్నంత కాలం ఇలాంటి మాటలు వింటూనే వచ్చాను. ఇవేవీ నాకు ముఖ్యం కాదు. మైదానంలో బరిలోకి దిగి పరుగులు చేస్తున్నానా లేదా అనేది మాత్రమే నాకు ముఖ్యం. నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రతీసారి ప్రయత్నిస్తాను. జట్ట విజయంలో నా వంతు పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం దానిపైనే ఫోకస్ చేశాను. కొందరు మైదానం బయట నా గురించి ఏవో ప్రచారం చేస్తుంటారు. వాటిని అలాగే జరగనివ్వండి, ఇవి లేకపోతే జీవితంలో మజానే ఉండదు. నా పని స్టేడియం లోపలే ఉంది. వారి పని బయట చేస్తున్నారని’ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

సిరీస్ డిసైడ్ చేసే చివరి వన్డేలో మంచి ఆరంభం లభించినప్పటికీ ఓడిపోవడంతో నిరాశ చెందాను. మేం కొన్ని రన్స్ తక్కువగా చేశాం. బౌలింగ్ విషయానికి వస్తే, ఎక్కువ వన్డే క్రికెట్ ఆడని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని అందరూ అర్థం చేసుకోవాలి. వారికి సెటిల్ కావడానికి కొంత సమయం ఇవ్వాలి. ఇంగ్లాండ్‌లో ఆడటం తనకు చాలా ఇష్టమని, అయితే లార్డ్స్ వన్డే ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేశానని, కానీ మ్యాచ్ రిజల్ట్ నిరాశకు గురిచేసింది - రోహిత్ శర్మ 

Frequently Asked Questions

రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయా?

అవును, రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో మూడో వన్డే తర్వాత రిటైర్ అవుతారని ప్రచారం జరిగింది. అయితే బీసీసీఐ కార్యదర్శి ఈ వార్తలను ఖండించారు.

తన రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఎలా స్పందించారు?

అరంగేట్రం నుంచీ ఇలాంటి వార్తలు వింటున్నానని, తన పని బ్యాటింగ్ చేయడం, జట్టు కోసం ఆడటం అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. బయట జరిగే ప్రచారాలు ముఖ్యం కాదన్నారు.

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉంది?

రోహిత్ శర్మ 138 పరుగులు చేసి శతకం సాధించారు. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచారు.

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఉంటారా లేదా అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చిందా?

బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా రిటైర్మెంట్ వార్తలను ఖండించినప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ భాగం అవుతారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget