అన్వేషించండి

Rohit Sharma: ఆ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో ఏం ఉపయోగం, వార్తలపై రోహిత్‌ ఆగ్రహం

Team India captain Rohit Sharma: తొలి టెస్టులో ఓటమికి సరైన సన్నద్ధత లేకపోవడమే కారణమంటూ వచ్చిన వార్తలను కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు.

India vs South Africa Test Series: సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. విరాట్‌ కోహ్లీ పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. దక్షిణాఫ్రికా పేసర్ల నిప్పులు చెరిగే బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానమే కరువైంది. సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుభ్‌మన్ గిల్ 26 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అయితే ఈ ఓటమికి సరైన సన్నద్ధత లేకపోవడమే కారణమంటూ వచ్చిన వార్తలను కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్ ప్రాక్టీస్‌ టెస్టుల వల్ల... పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని  హిట్‌మ్యాన్‌ అన్నాడు. ఇంట్రా స్క్వాడ్‌ పోటీల కోసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను నిలిపేయడంపై వచ్చిన ప్రశ్నలపై రోహిత్ స్పందించాడు.
 
నాలుగైదేళ్లలో తాము చాలా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడామన్న రోహిత్‌... అలాగే ఫస్ట్‌క్లాస్‌ టెస్టుల్లోనూ పాల్గొన్నామని.. అయితే అసలైన టెస్టు మ్యాచ్‌ల కోసం వినియోగించే పిచ్‌లను ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో వాడరని రోహిత్‌ గుర్తు చేశాజు. అందుకే, అలాంటి వాటికి దూరంగా ఉండి, అవసరమైన విభాగాలపై దృష్టి పెట్టామని తెలిపాడు. తమకు అనుకూలమైన పిచ్‌ను తయారు చేయించుకుని ప్రాక్టీస్‌ చేశామని... గతంలో ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు, దక్షిణాఫ్రికాతో 2018 పర్యటనలోనూ ఇలానే చేశామని హిట్ మ్యాన్‌ గుర్తు చేశాడు. ప్రాక్టీస్‌ పిచ్‌లపై బంతి ఎక్కువగా బౌన్స్‌ కాదని... కానీ, కీలక పోరులో మాత్రం మన తలపైకి బౌన్స్‌ అవుతుందని తెలిపాడు. ప్రాక్టీస్‌ మ్యాచుల్లోనూ అలాంటి పిచ్‌లు ఉంటే ఓకే.. తాము కూడా ఆడతామని రోహిత్ తెలిపాడు.
 
తొలి టెస్ట్‌ సాగిందిలా...
ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో245 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ మినహా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కఠిన సవాళ్లను ఎదుర్కొని కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో టీమిండియాకు గౌరవప్రమదమైన స్కోరు అందించాడు. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో టాప్‌ఆర్డర్‌ విఫలమవడంతో జట్టు 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్‌.. జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ప్రొటీస్‌ను ఎల్గర్‌ భారీ స్కోరు దిశగా నడిపించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ ఇచ్చిన క్యాచ్‌ చేజారింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడబోయిన ఎల్గర్‌ వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. భారీ శతకంతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన డీన్‌ ఎల్గర్‌ 185 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
 
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుభ్‌మన్ గిల్ 26 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్‌ 4, మార్కో జాన్‌సెన్ 3, రబాడ 2 వికెట్లు తీశారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget