అన్వేషించండి

Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్

Rishabh Pant Breaks Silence on T20 World Cup 2024 Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ నిజంగానే గాయపడ్డాడా, లేక కావాలనే అలా చేశాడా అని రోహిత్ శర్మ కామెంట్లతో అందరికీ డౌటొచ్చింది.

Rishabh Pant disrupted South Africas rhythm during the T20 World Cup 2024 final | టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వ్యూహంతో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించిందని కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పంత్ బ్రిలియంట్ ఐడియా అని ప్రశంసించారు. కీలకమైన మ్యాచ్ లో శక్తితో పాటు యుక్తి కూడా ఉండాలని యువ సంచలనం పంత్ నిరూపించాడని భారత క్రికెట్ ప్రేమికులు కితాబిచ్చారు. అయితే ఫైనల్లో ఆ సమయంలో పంత్ గాయపడ్డట్లుగా చేసి కొంత టైం బ్రేక్ వచ్చేలా చేయడంతో, దక్షిణాఫ్రికా దూకుడు కళ్లెం వేశామని రోహిత్ తెలిపాడు. తద్వారా భారత్ 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరం కాగా, టీ20లో ఇది చాలా తేలిక. కానీ మ్యాచ్ లో సఫారీల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు రిషభ్ పంత్ వ్యూహం ఫలించింది. తాను ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా అకస్మాత్తుగా మోకాలికి గాయంతో రిషబ్ పంత్ కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చాడు. పంత్ కు టేప్ వేసి ఫిజియో వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మ్యాచ్ కాస్త నెమ్మదించి, సఫారీలు లయ కోల్పోవడంతో భారత బౌలర్ల పని తేలికైంది. దీనికంతటికి పంత్ బ్రిలియంట్ మైండ్ సెట్ కారణమని’ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గాయం కాకున్నా పంత్ అలా చేశాడని, అదే భారత్ విజయానికి దారితీసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. రోహిత్ శర్మ కామెంట్స్ పై కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తొలిసారి స్పందించాడు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ‘కీలకమైన సమయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. గతం రెండు, మూడు ఓవర్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారీగా పరుగులు చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ లాంటి టైమ్ మళ్లీ వస్తుందా? ఏం చేయాలా అని ఆలోచించి మైదానంలో పడిపోయాను. కొంత టైమ్ ఇక్కడ వెచ్చించండి. టేప్ వేస్తున్నట్లు ఏదో ఒకటి చేస్తూ కాస్త టైమ్ వేస్ట్ చేయాలని  ఫిజియోకి చెప్పానని’ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఫిజియోతో జరిగిన సంభాషణను వెల్లడించాడు.

కొన్నిసార్లు మ్యాచ్ నెగ్గాలంటే చిన్న టెక్నిక్ ఉపయోగించాలి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తాను అదే చేశానన్నాడు పంత్. మోకాలికి మీద తొడ బాగంలో టేపు వేయడానికి టైం పడుతుందని ఫిజియో నాతో చెప్పగా, మాకు కావాల్సింది అదే టైమ్ తీసుకోమని తాను చెప్పినట్లు పంత్ వెల్లడించాడు. అప్పుడు ఫిజియో నాతో మస్త్ యాక్టింగ్ చేస్తున్నావ్ భాయ్ అన్నాడని ఆరోజు జరిగిన ఘటనపై రిషబ్ పంత్ తాను ఏం చేశాడో షేర్ చేసుకున్నాడు. కీలక సమయంలో అవసరమైతే ఏదైనా చేయాలని, కొంత సమయం తాను యాక్టింగ్ చేశాడని పంత్ చెప్పడంతో అంతా నవ్వారు. పంత్ యాక్టింగ్ సూపర్ అని, ఆస్కార్ కు ఆస్కారం ఉందని నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget