అన్వేషించండి

Ind Vs Eng Test Series Updates: ఆ దిగ్గ‌జాలుంటే మూడో టెస్టులో ఇండియా గెలిచేదేమో..! కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీల‌క నేత వ్యాఖ్య‌

గ‌తేడాది టీ20ల‌కు , ఈ ఏడాది టెస్టుల‌కు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. దీంతో ఈ రెండు ఫార్మాట్ల‌లో భార‌త్ సంధి ద‌శ‌లో ఉంది. అయితే వ‌న్డేల్లో మాత్ర‌మే వీరిద్ద‌రూ ఆడుతున్నారు.

Rajeev Shukla Comments:  దిగ్గ‌జ క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత యువ టీమిండియా.. తొలిసారిగా ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న చేస్తూ, ఆక‌ట్టుకుంటుంది. ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లు ముగిసేస‌రికి 1-2తో వెనుకంజ‌లో నిలిచినా, ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఈ టెస్టుల్లో మ‌న టీమే పైచేయి సాధించింది. మ్యాచ్ లో చాలా భాగం వ‌ర‌కు ఆధిప‌త్యం ప్ర‌దర్శించింది. ఇక మూడో టెస్టులో అనుభ‌వం లేక పోవ‌డం వ‌ల్ల టీమిండియాకు ఓట‌మి పాలైంద‌ని పేర్కొంటున్నారు చాలామంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ఉంటే క‌థ వేరుగా ఉండేద‌ని, ఈ మ్యాచ్ లో క‌చ్చితంగా విజ‌యం సాధించేవార‌మ‌ని భార‌త అభిమానులు చ‌ర్చ జ‌రుపుతున్నారు. తాజాగా దీనిపై బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై ప్ర‌క‌ట‌న చేశారు. 

సొంత నిర్ణ‌యం..
మూడో టెస్టులో ఈ దిగ్గ‌జాలు ఉంటే బాగుండేద‌ని, క‌చ్చితంగా గెలిచే వార‌మనే వ్యాఖ్య‌ల‌తో శుక్లా ఏకీభ‌వించారు. అయితే వారి రిటైర్మెంట్ నిర్ణ‌యం వెన‌కాల బీసీసీఐ పాత్ర ఏమీ లేద‌ని పున‌రుద్ఘాటించారు. రిటైర్మెంట్ అనేది సొంత నిర్ణ‌య‌మ‌ని, దీనిపై బోర్డు క‌ల‌గ జేసుకోలేద‌ని పేర్కొన్నారు. ఏ ఆట‌గాడిని కూడా రిటైరవ్వాల‌ని బోర్డు ఆదేశించ జాల‌బోద‌ని తెలిపారు. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌కప్ గెలిచాక రోకో ద్వ‌యం.. పొట్టి ఫార్మాట్ కు టాటా చెప్పారు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న త‌ర్వాత స‌డెన్ గా ముందు రోహిత్, ఆ త‌ర్వాత కోహ్లీ టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికారు. అయితే వ‌న్డేల‌కు మాత్రం అందుబాటులో ఉంటామ‌ని వెల్ల‌డించారు. ఈ దిగ్గ‌జాలు వన్డేల‌కు అందుబాటులో ఉండ‌టం మంచి ప‌రిణామ‌మ‌ని శుక్లా పేర్కొన్నారు. 

జ‌వాబిచ్చిన గిల్..
ఇక ఈ ప‌ర్య‌ట‌న‌కి ముందు జ‌ట్టులో త‌న స్థానంపై ఎదురైన ప్ర‌శ్న‌ల‌కు గిల్ అద్బుతంగా స‌మాధామ‌నిచ్చాడ‌ని శుక్లా పేర్కొన్నారు. ఒక డబుల్ సెంచ‌రీ, రెండు సెంచ‌రీలతో సిరీస్ లో టాప్ స్కోర‌ర్ గా నిలిచిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఆట‌గాడిగానే కాకుండా కెప్టెన్ గా కూడా గిల్ ఆక‌ట్టుకున్నాడ‌ని ప్ర‌శంసించారు. ఇక ఈ సిరీస్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన గిల్.. ఇంగ్లాండ్ లో ఒక సిరీస్ లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన భార‌త బ్యాట‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. మ‌రోవైపు నాలుగో టెస్టులో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాను ఆడించాల‌ని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. నాలుగో టెస్టుకు ఇంకా వారం రోజుల‌కుపైగా వ్య‌వ‌ధి ఉండ‌టంతో బుమ్రాను ఆడిస్తే బాగుంటుంద‌ని, బుమ్రా లేక‌పోతే, జ‌ట్టు ఓడిపోయే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపాడు. నాలుగో టెస్టులో భార‌త్ ఓడితే సిరీస్ ఫ‌లితం తేలి పోతుంద‌ని, అందుకే బుమ్రాను ఆడించాల‌ని సూచించాడు. నిజానికి ఈ సిరీస్ కంటే ముందే, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా కేవలం మూడు టెస్టులు మాత్రమే జస్ ప్రీత్ బుమ్రా ఆడతాడని హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  ఈనెల 23 నుంచి మాంచెస్ట‌ర్ లో నాలుటో టెస్టు ప్రారంభం కానుంది. 

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
Ind Declared VS AFG: భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
KL Rahul Survives: ఏం యాక్టింగ్ భ‌య్యా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల స‌ర‌దా ట్రోలింగ్..
ఏం యాక్టింగ్ భ‌య్యా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. కేఎల్ రాహుల్ పై నెటిజ‌న్ల స‌ర‌దా ట్రోలింగ్..

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget