Bumrah, Siraj Batting Ind vs Eng | బ్యాట్ తో అడ్డరగొట్టిన బౌలర్లు బుమ్రా సిరాజ్
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. జడేజా తప్పా మిగితా ప్లేయర్స్ ఎవరు రాణించలేక పొయ్యారు. వరుసగా వికెట్స్ పడుతున్నా కూడా జడేజా మాత్రం కన్సిస్టెంట్ గా ఆడుతూ వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో బ్యాట్టింగ్ చేయడానికి వచ్చిన బౌలర్లు జడేజాకు మంచి సహకారం అందించారు. ముఖ్యంగా బుమ్రా, సిరాజ్.
193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కీలకమైన 8వికెట్లను 112 పరుగులకే కోల్పోయింది. ఆ టైంలో బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రా క్రీజ్‌లో ఉన్న జడేజాకు పూర్తి సహకారం అందించాడు. వీళ్లిద్దరు కలిసి 16 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. 54 బాల్స్ ఎదుర్కున్న బుమ్రా కేవలం 5 పరుగులు మాత్రమే చేసాడు. విజయానికి చేరువుతున్న క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన బుమ్రా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ సిరాజ్ కూడా జడెజాకు మంచి సహకారం అందించాడు. 30 బాల్స్ ఎదుర్కున్న సిరాజ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసాడు. కానీ డిఫెన్స్ ఆడిన బంతి మళ్లీ వికెట్లకు తాకడంతో సిరాజ్ అవుటయ్యాడు.
బౌలర్లు అయినప్పటికీ కూడా బుమ్రా, సిరాజ్ డిఫెన్సె ఆడుతూ వికెట్ పడకుండా జడేజాకు పూర్తి సహకారం అందించారు. మరోపక్క జడేజా భారీ షార్ట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డిఫెన్సె తో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు బాగా చిరాకు తెప్పించారు. వికెట్స్ ను కాపాడుకుంటూ క్రిజ్ లోనే పాతుకుపోయ్యారు. కానీ 74.5 ఓవర్‌లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ అవుట్ అవడంతో టీమిండియా పోరాటం ముగిసింది.





















