అన్వేషించండి

Galle Rain Threat:  టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీ వ‌రుణుడి వ‌ర్షం త‌ప్ప‌దా..!

గాలే టెస్ట్ మూడో రోజు 83 శాతం వర్ష సూచన ఉందని తెలుస్తోంది. ఇక మూడో రోజు త్వరగానే ఇండియా ఆలౌౌట్ కాగా.. లంక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

IND VS SL Day 3 Live Updates:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఆట ప్రారంభ‌మైన 4 బంతుల‌కే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 116.4 ఓవ‌ర్ల‌లో 462 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. రెండో బంతికే మ‌హ్మ‌ద్ సిరాజ్.. వికెట్ తీసి లంక‌ను దెబ్బ కొట్టాడు. మ‌రోవైపు మూడో రోజు వాతావరణం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రెండో రోజులాగే మూడో రోజు కూడా వర్షం వల్ల ఆట మాటిమాటికీ ఆగిపోయే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోజంతా దాదాపు 83 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

రోజంతా వాన ముప్పు.. సెషన్ల వారీగా ఆక్యువెదర్ రిపోర్ట్
ఆక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం గాలే మైదానంలో మూడు సెషన్లలోనూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు 51 శాతం వర్ష సూచన ఉండగా, 11 గంటలకు 47 శాతానికి తగ్గింది. మధ్యాహ్నం 12 గంటలకు 44 శాతం, 1 గంటకు 48 శాతంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అత్యధికంగా 52 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఆఖరి సెషన్ లో 3 గంటలకు 45 శాతం, సాయంత్రం 5 గంటల నాటికి 34 శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ కు భారీ పనిభారం తప్పేలా లేదు.

ఇండియా ఇన్నింగ్స్ ముగింపు.. పడిక్కల్ 167 రన్స్ విశ్వరూపం
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 460/9 స్కోరుతో ఉన్న ఇండియా, మూడో రోజు ఉదయం కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే చివరి వికెట్ కోల్పోయింది. నంబర్ 3 బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 రన్స్ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ప్ర‌భాత్ జ‌య‌సూర్య నాలుగు వికెట్లు, కేష‌ర నువాంత‌కు మూడు, అషిత ఫెర్నాండో కు రెండు వికెట్లు ద‌క్కాయి. మ‌రోవైపు ఉదయం పిచ్ రోలర్ ను ఇండియా ఉపయోగించలేదని, పిచ్ మరింతగా దెబ్బతినాలనే ప్లాన్ తోనే అలా చేశారని సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించాడు. భారీ స్కోరు బోర్డుపై ఉండటంతో మ్యాచ్ పై ఇండియా పట్టు బిగించేందుకు మార్గం సుగ‌మం చేసుకుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

లంక రెండు వికెట్లు డౌన్..
శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతితో విరుచుకుపడ్డాడు. సీమ్ అవుతూ వేగంగా వచ్చిన బంతిని డిఫెన్స్ చేయబోయిన లంక ఓపెనర్ నిషాన్ మధుష్క, బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ చేతికి చిక్కాడు. దీంతో ఖాతా తెరవకుండానే మధుష్క డకౌట్ గా పెవిలియన్ చేరాడు. సిరాజ్ వేసిన ఈ దెబ్బతో లంకకు ఆరంభంలోనే క‌ష్టాలు ఎదుర‌య్యాయి. మ‌రికాసేప‌టికే మాన‌వ్ సుతార్.. వెట‌రన్ దినేశ్ చండిమాల్ (5) ను పెవిలియ‌న్ కు పంపాడు. దీంతో 27 ప‌రుగుల‌కే లంక రెండు వికెట్లు కోల్పోయిన‌ట్ల‌య్యింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Galle Rain Threat:  టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీ వ‌రుణుడి వ‌ర్షం త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీ వ‌రుణుడి వ‌ర్షం త‌ప్ప‌దా..!
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget