అన్వేషించండి

Australia: వర్షం కారణంగా వరల్డ్ కప్‌ నుంచి ఆస్ట్రేలియా అవుట్! సూపర్ 8కి అర్హత సాధించిన జింబాబ్వే  

Australia: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా పెట్టుకున్న ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. జింబాబ్వేను ఐర్లాండ్ ఓడిస్తే సూపర్‌-8 అవకాశాలను సజీవంగా ఉంటాయని అనుకన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షం కారణంగా జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ రద్దు, జింబాబ్వే సూపర్ 8కు చేరింది.
  • జింబాబ్వే సూపర్ 8కు చేరడంతో ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది.
  • 2009 తర్వాత ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ లీగ్ దశలో తొలిసారిగా నిష్క్రమించింది.
  • జింబాబ్వే T20 ప్రపంచ కప్ సూపర్ 8కు అర్హత సాధించిన ఏడో జట్టుగా నిలిచింది.

Australia: T20 ప్రపంచ కప్ 2026‌లో ఆస్ట్రేలియాకు వర్షం పెద్ద దెబ్బ కొట్టింది.  కంటిన్యూగా వర్షం పడుతున్నందున జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ టాస్ లేకుండానే రద్దయింది. దీంతో జింబాబ్వేకు రెండు పాయింట్స్ లభించాయి. ఈ పాయింట్లతో ఆ జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ 2026 నుంచి లీగ్ దశలోనే అవుట్‌ అయ్యింది. T20 ప్రపంచ కప్ 2009 తర్వాత ఆస్ట్రేలియా జట్టు లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి వెళ్లిపోవడం ఇదే మొదటిసారి. 

జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్‌ను కీలకమైందిగా ఆస్ట్రేలియా భావించింది. కానీ వర్షం వారి ఆశలను అంచనాలు తలకిందులు చేసింది.  పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయ్యింది. తెల్లవారుజాము నుంచి పల్లెకెలెలో కంటిన్యూగా వర్షం పడుతోంది. మ్యాచ్ సమయంలో కూడా  కుండపోత వాన పడుతూ ఉంది. రెండున్నర గంటల పాటు వేచి ఉన్నా సరే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. 

ఐర్లాండ్‌తో మ్యాచ్ జరిగి జింబాబ్వే ఓడిపోయి ఉంటే, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరుకునే ఆశలు సజీవంగా ఉండేవి. ఈరోజు ఐర్లాండ్ విజయంపై కంగారూలు ఆశలు పెట్టుకున్నారు. అయితే, వర్షం వారి ఆశలను పూర్తిగా దెబ్బతీసింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జింబాబ్వే అద్భుతంగా రాణించింది. సికందర్ రజా నేతృత్వంలోని జట్టు ఆస్ట్రేలియాను ఓడించి షాక్ ఇచ్చింది. దీంతో ప్రపంచ కప్‌లో అతిపెద్ద ఓటమిని ఆసిస్‌ ఎదుర్కొంది. జింబాబ్వే చేతిలో ఓడిపోయిన తర్వాత, సోమవారం కంగారూలు శ్రీలంక చేతిలో కూడా ఓడిపోయారు. ఇప్పుడు, ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

జింబాబ్వే టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 8 దశకు చేరుకోవడం ఇదే తొలిసారి. 2024లో ప్రపంచ కప్ ఫార్మాట్ మార్చిన తర్వాత, జింబాబ్వే గ్రూప్ దశను దాటడం ఇదే తొలిసారి. అయితే, టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే గ్రూప్ దశను దాటి ముందుకు సాగడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో వారు చివరి 12 స్థానాలకు చేరుకున్నారు, కానీ ఫార్మాట్ మార్పు తర్వాత వారికి ఇదే తొలి సూపర్ 8.

ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఒకే ఒక్క విజయం సాధించింది. జింబాబ్వే తమ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఐర్లాండ్ జింబాబ్వేపై ఏదో ఒక విధంగా గెలవాలని ఆస్ట్రేలియా ఆశించింది. ఆస్ట్రేలియా సూపర్ 8 ఆశలను సజీవంగా ఉంచుతుంది భావించింది. అయితే, మ్యాచ్ డ్రాగా ముగియడంతో, జింబాబ్వే మొత్తం పాయింట్లు ఐదుకి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో మిగిలిపోయింది. ఫలితంగా, T20 ప్రపంచ కప్‌2026లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటిబాటపట్టింది. గతంలో, 2009 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా గ్రూప్ దశ దాటి ముందుకు సాగలేకపోయింది. 

జింబాబ్వే తొలిసారిగా T20 ప్రపంచ కప్‌లో సూపర్ 8 దశకు చేరుకుంది. గతంలో, జింబాబ్వే T20 ప్రపంచ కప్ 2022 ‌లో సూపర్ 12 దశకు చేరుకుంది. T20 ప్రపంచ కప్ 2026‌లో సూపర్ 8 దశకు అర్హత సాధించిన ఏడో జట్టు జింబాబ్వే. ఇప్పటికే టీమిండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ సూపర్ 8 దశకు చేరుకున్నాయి. ఇప్పుడు, పాకిస్తాన్, USA ఫైనల్ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోతే, అది కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. 

Frequently Asked Questions

T20 ప్రపంచ కప్ 2026 నుండి ఆస్ట్రేలియా ఎలా నిష్క్రమించింది?

జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ లేకుండానే రద్దయింది. ఈ డ్రా వల్ల జింబాబ్వే సూపర్ 8కి అర్హత సాధించింది, ఫలితంగా ఆస్ట్రేలియా లీగ్ దశలోనే నిష్క్రమించింది.

జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడానికి కారణం ఏమిటి?

పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కంటిన్యూస్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ 2026 నుండి ఎప్పుడు చివరిసారిగా లీగ్ దశలోనే నిష్క్రమించింది?

T20 ప్రపంచ కప్ 2009 తర్వాత ఆస్ట్రేలియా జట్టు లీగ్ దశలోనే టోర్నమెంట్ నుండి నిష్క్రమించడం ఇదే మొదటిసారి.

ఈ T20 ప్రపంచ కప్ లో జింబాబ్వే ప్రదర్శన ఎలా ఉంది?

జింబాబ్వే ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించింది, ఆస్ట్రేలియాను ఓడించి షాక్ ఇచ్చింది. వారు ఇప్పుడు తొలిసారిగా సూపర్ 8 దశకు చేరుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget