అన్వేషించండి
Advertisement
PAK vs BAN: పాకిస్థాన్ పరాజయాల పరంపరకు చెక్ పడేనా, సెమీస్ ఆశలు నిలవాలంటే బంగ్లాపై నెగ్గాలి!
ODI World Cup 2023: క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్థాన్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. పాక్‌కు సెమీస్ చేరాలంటే , సాంకేతిక అవకాశాలైన సజీవంగా ఉండాలంటే పాకిస్థాన్‌కు ఈ విజయం తప్పనిసరి.
వరుసగా పరాజయాలు.. ఎటుచుసినా విమర్శలు.. మాజీ క్రికెటర్ల ఆరోపణలు... కెప్టెన్‌గా అర్హుడు కాదంటూ నిందలు... సెమీస్‌పై మిణుకుమిణుకుమంటున్న ఆశలు.. ఇదీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్థాన్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. పాక్‌కు సెమీస్ చేరాలంటే సాంకేతికంగా అవకాశాలు ఉన్నాయి. ఈ సాంకేతిక అవకాశాలైన సజీవంగా ఉండాలంటే పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. వరుసగా నాలుగు పరాజయాలతో ఇంటా బయటు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి విమర్శలకు చెక్ పెట్టాలని పాక్ భావిస్తోంది.
ఇటు బంగ్లా కూడా వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఆడిన ఆరు మ్యాచుల్లో రెండు విజయాలు... నాలుగు పరాజయాలతో పాక్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా....ఆరు మ్యాచుల్లో అయిదు పరాజయాలు.. ఒకే విజయంతో బంగ్లా తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి పాక్, బంగ్లా వరుస ఓటములకు చెక్ పెట్టాలని చూస్తున్నాయి. పేపర్‌పై బంగ్లాకన్నా పాక్ బలంగా కనిపిస్తున్నా ఇప్పటికే అఫ్గాన్‌పై ఓటమి పాలైన బాబర్ సేనకు... బంగ్లా సవాల్ విసిరే అవకాశం ఉంది.
కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇదే మైదానంలో 2016లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. మరోసారి ఇదే ఫలితాన్ని రిపీట్ చేయాలని పాక్ భావిస్తోంది. నిరాశాజనక ప్రదర్శనలతో స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఈ జట్లు ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్నాయి. బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ సేన దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తేడాతో పరాజయం పాలైంది.
బాబర్, మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ భారీ స్కోర్లు చేయాలని చూస్తున్నారు. మహ్మద్ రిజ్వాన్ పర్వాలేదనిపిస్తున్నా భారీ స్కోర్లు చేయాల్సి ఉంది. షహీన్ షా అఫ్రీదీ, హరీస్ రౌఫ్ అంచనాలను అందుకోలేకపోతున్నారు. వీరు రాణిస్తే పాక్ గెలుపు తేలికే. కానీ బలహీనమైన ఫీల్డింగ్ కూడా పాక్ ఓటములకు కారణమవుతోంది. దీన్ని సరిదిద్దుకోవాలని దాయాది దేశం చూస్తోంది. మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్ మినహా మిగిలిన బ్యాటర్లెవరూ ఈ ప్రపంచకప్‌లో రాణించలేదు. బంగ్లాదేశ్ బౌలింగ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. బ్యాటర్లు రాణించి... బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్ట్
కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో సగటు స్కోరు 236 పరుగులు. బౌండరీ లైన్‌లు దగ్గరగా ఉండడంతో బ్యాటర్లు భారీ షాట్లు ఆడే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లకు ఆరంభంలో పిట్ సహకరించే అవకాశం ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు ఉపయోగపడనుందన్న అంచనాలు ఉన్నాయి.
పాకిస్థాన్ జట్టు:
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం, హరీస్ రవూఫ్
బంగ్లాదేశ్ జట్టు: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement