అన్వేషించండి

NZ vs PAK: దాయాది సెమీస్‌ ఆశలు సజీవం , డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో పాక్ విజయం

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో విజయం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో పాక్‌ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.

ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో విజయం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో పాక్‌ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్‌ బ్యాటర్ ఫకార్‌ జమాన్‌  విధ్వంసంతో భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనించింది ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో లక్ష్యాన్ని తగ్గించారు. అనంతరం మళ్లీ వర్షం పడడంతో పాక్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ భారీ స్కోరు చేసింది. కివీస్‌  బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్‌ రవీంద్ర మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సెంచరీ చేశాడు. వరల్డ్‌కప్‌లో మూడు శతకాలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్‌గా రచిన్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. సారధి కేన్‌ విలియమ్సన్‌ జట్టులోకి వచ్చి రావడంతోనే అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. రచిన్‌, విలియమ్సన్‌  పాక్‌ బౌలర్లను ఊచకోత కోసి 180 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేయడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవన్ కాన్వే, రచిన్‌ రవీంద్ర తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. 39 బంతుల్లో ఆరు ఫోర్లతో 35 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన డేవిడ్‌ కాన్వేను హసన్‌ అలీ అవుట్‌ చేశాడు. హసన్‌ అలీ వేసిన బౌన్సర్‌ను హుక్‌ చేయబోయిన కాన్వే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ ఆనందం పాక్‌కు ఎక్కువసేపు నిలువలేదు. 
 
రచిన్‌- కేన్‌ భాగస్వామ్యం
రచిన్‌ రవీంద్రకు జత కలిసిన సారధి కేన్‌ విలియమ్సన్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరూ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. రన్‌రేట్‌ ఎక్కడా తగ్గకుండా ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో 88 బంతుల్లోనే రచిన్‌ రవీంద్ర శతకం పూర్తి చేసుకున్నాడు.  వికెట్ల కోసం పాక్‌ బౌలర్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. చివరికి 79 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 95 పరుగులు చేసి శతకం దిశగా దూసుకుపోతున్న సారధి విలియమ్సన్‌ను ఇఫ్తికార్‌ అహ్మద్‌ అవుట్‌ చేశాడు. దీంతో 180 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కాసేపటికే రచిన్‌ రవీంద్ర కూడా అవుటయ్యాడు. 95 బంతుల్లో 15 ఫోర్లు,  1 సిక్సుతో 108 పరుగులు చేసిన రచిన్‌ను మహ్మద్‌ వసీమ్‌ అవుట్ చేశాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సుతో 29 పరుగులు చేసిన మిచెల్‌ను హరీస్‌ రౌఫ్ బౌల్డ్‌ చేశాడు. 27 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న చాప్‌మన్‌ను మహ్మద్‌ వసీమ్ బౌల్డ్ చేశాడు. కానీ గ్లెన్‌ ఫిలిప్‌ మాత్రం పోరాటం ఆపలేదు. కేవలం 25 బంతుల్లోనే 2 సిక్సులు, నాలుగు ఫోర్లతో ఫిలిప్‌ 41 పరుగులు చేశాడు. చివర్లో శాంట్నర్‌ కూడా బ్యాటు ఝుళిపించడంతో  న్యూజిలాండ్‌  నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది.పాక్ బౌలర్లలో షహీన్‌ షా అఫ్రిదీ 10 ఓవర్లు వేసి 90 పరుగులు ఇచ్చాడు. మహ్మద్‌ వసీమ్‌ 10 ఓవర్లలలో 60 పరుగులు ఇచ్చి 3 వికెట్లు నేలకూల్చాడు. హసన్‌ అలీ 10 ఓవర్లలలో 82, హరీస్‌ రౌఫట్‌ 10 ఓవర్లలలో 85 పరుగులు ఇచ్చారంటే కివీస్‌ బ్యాటింగ్‌ విధ్వంసం ఎలా   తెలుసుకోవచ్చు. 
 
ఫకర్‌ జమాన్ ధనాధన్‌
అనంతరం 402 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. జట్టు స్కోరు ఆరు పరుగులు చేరిందో లేదో అబ్దుల్లా షఫీక్‌ అవుటైపోయాడు. 9 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన షఫీక్‌ను సౌధీ అవుట్‌ చేశాడు. ఈ ఒక్క వికెట్‌ మినహా కివీస్‌ బౌలర్లు మరొక వికెట్‌ తీయలేకపోయారు. ఫకర్‌ జమాన్ న్యూజిలాండ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ విధ్వంసం సృష్టించాడు. 63 బంతుల్లోనే ఫకర్‌ జమాన్‌ శతకం సాధించాడు. కేవలం 81 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాబర్‌ ఆజమ్‌ కూడా 63 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సులతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యంతో పాక్‌ లక్ష్యం దిశగా నడిచింది. అయితే వర్షం కారణంగా నిలిపేశారు. 21.3 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత వరుణుడు శాంతించడంతో పాక్‌ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 341కి కుదించి ఆటను కొనసాగించారు. 25.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి పాకిస్థాన్‌ 200/1 స్కోరు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్‌ 25.3 ఓవర్లకు 179 పరుగులు చేయాలి. పాకిస్థాన్‌ అప్పటికే 21 పరుగుల ముందంజలో ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో పాక్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలతో పాక్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu And Venkata Datta Sai Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Embed widget