అన్వేషించండి

Ned vs SL: ఆచితూడి ఆడుతున్న నెదర్లాండ్స్‌

Netherlands vs Sri Lanka: నెదర్లాండ్స్ గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇచ్చి ఆత్మివిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో లంకకు షాక్ ఇవ్వాలని డచ్‌ జట్టు భావిస్తోంది.

ఈ ప్రపంచకప్‌లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో  నెదర్సాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బరిలోకి దిగింది. ఈమ్యాచ్‌లో టాస్‌గెలిచిన నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగి ఆచితూచీ ఆడుతోంది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌... సెమీస్‌లో అడుగు పెట్టాలని పట్టుదలతో ఉన్న శ్రీలంకకు చాలా కీలకమైంది. నెదర్లాండ్స్ గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇచ్చి ఆత్మివిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో లంకకు షాక్ ఇవ్వాలని డచ్‌ జట్టు భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ శ్రీలంక ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే లంక సెమీస్‌ ఆశలు దాదాపుగా మూసుకునిపోయినట్లే. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో లంక ఉంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన నెదర్లాండ్స్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లతో పాయింట్ల ఎనిమిదో స్థానంలో ఉండగా...శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్లు లేకుండా పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.
 
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయిస్టేడియం బౌలర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ స్టేడియంలో గత 10 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 262 పరుగులు. నెదర్లాండ్స్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఈ మెగా టోర్నీలో 3 మ్యాచ్‌లలో 54 సగటుతో మరియు 110.2 స్ట్రైక్ రేట్‌తో 108 పరుగులు చేశాడు. ఎడ్వర్డ్స్‌ అత్యధిక స్కోరు 78 నాటౌట్‌. ఈ మ్యాచ్‌లోనూ ఎడ్వర్డ్స్‌పై నెదర్లాండ్స్‌ ఆశలు పెట్టుకుంది. డచ్ బౌలర్‌ బాస్ డి లీడేపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డి లీడే 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌లో డీ లీడే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 4/62.
 
శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 3 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేశాడు. ఈ ప్రపంచ కప్‌లో శ్రీలంక తరపున టాప్‌ స్కోరర్‌గా కుశాల్‌ మెండిస్‌ ఉన్నాడు. కుశాల్‌ ఈ మ్యాచ్‌లో శతకం నమోదు చేయాలని లంక కోరుకుంటోంది. కుశాల్‌ ఈ మెగాటోర్నీలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌పై మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని కుశాల్‌ మెండీస్‌ భావిస్తున్నాడు. దిల్షాన్ మధుశంక కూడా రాణించాలని లంక కోరుకుంటోంది. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 26.28 సగటుతో మధుశంక 7 వికెట్లు తీశాడు. 3/38 మధుశంక అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.  ఇప్పటివరకూ వన్డేల్లో నెదర్లాండ్స్‌-శ్రీలంక అయిదుసార్లు తలపడగా అయిదుసార్లు శ్రీలంకే విజయం సాధించింది. ఈ అయిదు మ్యాచుల్లో లంక అత్యధిక స్కోరు 443. నెదర్లాండ్స్‌ను ఓ మ్యాచ్‌లో లంక 86 పరుగులకే కుప్పకూల్చింది. 
 
నెదర్లాండ్స్ ఫైనల్‌ 11: 
విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ'డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడ్, తేజా నిడమనూరు, 
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్‌ దత్త్, పాల్ వాన్ మీకెరెన్, 
 
శ్రీలంక ఫైనల్‌ 11:
పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుశాంత్ , లహిరు కుమార

టాప్ హెడ్ లైన్స్

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget