అన్వేషించండి

IPL 2024: హార్దిక్‌ నువ్వేమైనా ధోనీవా ?, షమీ ఘాటు విమర్శలు

Mohammed Shami on Hardik Pandya: మహ్మద్‌ షమీ హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ మూడు, నాలుగు స్థానాల్లో కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని షమీ తప్పుబట్టాడు

Mohammed Shami Slams Hardik Pandya: ఐపీఎల్‌(IPL)లో ముంబై ఇండియన్స్‌(MI)కు తొలి మ్యాచ్‌లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఐపీఎల్‌ టైటిల్‌ వేటను ఘనంగా ఆరంభించాలనుకున్న ముంబై ఆశలపై గుజరాత్‌ టైటాన్స్‌(GT) నీళ్లు చల్లింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గుజారాయ్ అద్భుత విజయం సాధించి ఐపీఎల్‌ 17వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకోగా... బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్యానికి 6 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. రోహిత్‌ శర్మ, బ్రెవీస్‌ రాణించినా ముంబైకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో గుజరాత్ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో...ముంబై బాటర్లను కట్టడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం కెప్టెన్సీ అంటూ మాజీలు హార్దిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా స్టార్ బౌలర్‌ షమీ కూడా హార్దిక్‌ కెప్టెన్సీపై పెదవి విరిచాడు.

షమీ ఏమన్నాడంటే..?
మహ్మద్‌ షమీ(Mohammed Shami )  హార్దిక్‌ పాండ్య( Hardik Pandya) కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ మూడు, నాలుగు స్థానాల్లో కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని షమీ తప్పుబట్టాడు. ధోనీలా ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదని షమీ హార్దిక్‌పై విమర్శలు చేశాడు. ధోనీ ఎప్పటికీ ధోనీనే అని. అతనికి ఎవరూ సరితూగరని కూడా షమీ  తెలిపాడు. ధోనీ అయినా కోహ్లీ అయినా అందరి ఆలోచనా ధోరణి ఒకేలా ఉండదని... నైపుణ్యాన్ని బట్టి ఆటలో కొనసాగాలని షమీ సూచించాడు. గుజరాత్ తరఫున హార్దిక్‌ పాండ్య మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడని....చాలాసార్లు ఐదో స్థానంలో కూడా ఆడాడని కానీ ముంబై తరఫున ఏడో స్థానంలో ఎందుకు వచ్చాడని షమీ ప్రశ్నించాడు. హార్దిక్ దాదాపు టెయిలెండర్‌లాగా కనిపిస్తున్నాడని.... ఏడో స్థానంలో వస్తే మీపై మీరే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుందన్నాడు. ఒకవేళ పాండ్య ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్‌ ఇంతవరకు వచ్చి ఉండేది కాదని షమి వ్యాఖ్యానించాడు.


తొలి ఓవర్‌ ఎందుకు..?
తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ముంబై ఓడిపోవడాన్ని ముంబై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో పరాజయానికి హార్దిక్‌ కెప్టెన్సీ కూడా ఓ కారణమని మాజీలు విమర్శిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, బ్రెవిస్, తిలక్‌ వర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా ముంబైకి విజయం మాత్రం  దక్కలేదు. హార్దిక్‌ పాండ్యా బౌలర్లను వినియోగించుకున్న తీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్‌, కెవిన్ పీటర్సన్‌ అసహనం వ్యక్తం చేశారు. బుమ్రా బదులు పాండ్య తొలి ఓవర్‌ వేయడం సరైంది కాదని మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ చేస్తూ ఈ ముగ్గురు వ్యాఖ్యానించారు. తొలి ఓవర్‌ను బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్‌ వేశాడు. అతడు సంధించిన 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు రాబట్టారు. తొలి ఓవర్‌ను బుమ్రా వేయకపోవడంపై ఇర్ఫాన్‌ పఠాన్‌ బుమ్రా ఎక్కడ అంటూ పోస్టు పెట్టడంతో వైరల్‌గా మారింది. పాండ్య బ్యాటింగ్ ఆర్డర్‌పైనా పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను తప్పించుకోవడానికి టిమ్‌ డేవిడ్‌ను ముందు పంపించాడనే అర్థంలో వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. వృద్ధిమాన్‌ సాహాను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో బుమ్రా కేవలం 14 రన్స్‌కే 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మొదట బౌలింగ్‌ ప్రారంభించిన పాండ్య మాత్రం వికెట్‌ లేకుండానే 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించాడు. హార్దిక్‌ ప్రణాళికలపై విమర్శలు రేగాయి. ఇటువైపు లక్ష్య ఛేదనలోనూ నాలుగు బంతుల్లోనే 11 రన్స్‌ చేసిన హార్దిక్‌.. కీలక సమయంలో ఔట్‌ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

టాప్ హెడ్ లైన్స్

Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget