Overrated Gill: గిల్ ఓవర్రేటెడ్ ప్లేయర్.. తనకంటే నాణ్యమైన ఆటగాళ్లున్నారు.. వారికి అవకాశమివ్వాలి: దిగ్గజ ప్లేయర్ ఫైర్
Overrated Gill: 2019లో అరంగేట్రం చేసిన గిల్.. అంతర్జాతీయంగా సరిగ్గా వంద మ్యాచ్ లు ఆడాడు. దాదాపు 4700కు పైగా పరుగులు చేశాడు. సగటు 41కి దగ్గరగా ఉంది. అందులో 12 సెంచరీలు ఉన్నాయి.
Ind Vs Aus test Series updates: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన కొంతమంది ఇండియన్ ప్లేయర్లకు చేదు అనుభవాలు మిగిల్చింది. సినియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా విపలమై జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నారు. కోహ్లీ ఐదు టెస్టులు ఆడగలిగాడు కానీ, చివరి టెస్టులో రోహిత్ పై వేటు పడిపోయింది. ఇక యువ ఆటగాళ్ల విషయానికొస్తే వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు టెస్టులు ఆడిన గిల్.. 18 సగటుతో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు కేవలం 31 మాత్రమే కావడం గమనార్హం. ఇక గిల్ లాంటి ప్లేయర్లకు చాలా అవకాశాలు ఇవ్వడంపై మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ మండిపడ్డాడు. ఇన్ని చాన్సులు ఇచ్చినా అతను సద్వినియోగం చేసుకోలేదని మండిపడ్డాడు.
తనో ఓవర్రేటేడ్ ఆటగాడు..
గిల్ ను మూడు ఫార్మాట్లలో ఆడిస్తున్నారని, అయితే అతను చాలా ఓవర్ రేటేడ్ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. గిల్ కు దొరికిన అవకాశాలు మరే ఇతర ఆటగాడికి లభించినట్లయితే అద్భుతాలు చేసి ఉండేవారని అభిప్రాయ పడ్డాడు. ఉదాహరణకు సూర్య కుమార్ యాదవ్ కు ఇన్ని చాన్సెస్ దొరికినట్లయితే టెస్టుల్లో పాతుకు పోయి ఉండేవాడని పేర్కొన్నాడు. తను ఒక టెస్టు మాత్రామే ఆడాడని, ఆ తర్వాత తనను పక్కన పెట్టి లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కు మాత్రమే పరిమితం చేశారని ఆరోపించాడు. ఇక యంగ్ ప్లేయర్ల కోసం చూసినట్లయితే సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో చాలామంది నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని వ్యాఖ్యానించాడు. దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా, రుతురాజ్ కు జాతీయజట్టులోకి పిలుపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇండియా ఏ తరపున ప్రతాపం..
ఇక సాయి సుదర్శన్ కూడా తరచూ ఇండియా ఏ తరపున విదేశీ టూర్లలో సత్తా చాటుతున్న తనను జాతీయ జట్టులోకి తీసుకోవడం లేదని శ్రీకాంత్ మండిపడ్డాడు. ఇలాంటి ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభివర్ణించాడు. గిల్ తనకు దొరికిన అవకాశాలను వేస్ట్ చేసుకుంటున్నాడని, తనో ఓవర్ రేటెడ్ ప్లేయరని తెలిపాడు. తాను ముందు నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నానని, ఇప్పుడది ప్రూవ్ అయిందని పేర్కొన్నాడు. దేశంలో ప్రతిభ గల యువకలకు కొదువ లేదని, ఇప్పటికైనా యువ ప్లేయర్లను ప్రొత్సహించాలని సూచించాడు. మరోవైపు గిల్ పై ప్రస్తుతమున్న సెలెక్షన్ కమిటీ చాలా నమ్మకముంచింది. గౌతం గంభీర్ కోచ్ గా పగ్గాలు చేపట్టాకా, లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్ గా కూడా నియమించింది. అయితే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో గిల్ తరచూ విఫలమవుతున్నాడు. తాజా ఆసీస్ పర్యటనలో తొలిసారి వెళ్లిన యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. తనే జట్టు తరపున లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. అయితే గిల్ కు గతంలో ఆసీస్ లో ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, ఈసారి ఉస్సూరుమనిపించాడు. తన ఆటతీరు ఇలాగే కొనసాగితే ఉద్వాసన ఖాయమని మాజీలు హెచ్చరిస్తున్నారు.
Also Read: Ind Vs Eng Odi Series Updates: వైస్ కెప్టెన్ రేసులో స్టార్ ప్లేయర్.. హార్దిక్, రాహుల్, గిల్ లకు నో ఛాన్స్..! ఇంగ్లాండ్ తో వచ్చేనెలలో వన్డే సిరీస్