KL Rahul: ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్ - రేపే జట్టులో చేరిక!
2023 ఆసియా కప్ జట్టులో కేఎల్ రాహుల్ చేరనున్నారు.
KL Rahul Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంతలోనే టీమ్ ఇండియాకు ఒక శుభవార్త వచ్చింది. మంగళవారం శ్రీలంకలో కేఎల్ రాహుల్... భారత జట్టులో చేరనున్నాడు. అతను సూపర్-4 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. గాయం నుంచి కూడా పూర్తిగా కోలుకున్నాడు. ప్రపంచకప్‌కు కూడా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
2023 ఆసియా కప్‌లో సూపర్-4 రౌండ్‌లో సెప్టెంబర్ 10వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. అంతకుముందు సెప్టెంబర్ 2వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఓడిపోయింది.
ప్రపంచకప్‌నకు భారత జట్లు ప్రకటన రేపే...
సెప్టెంబర్ 5వ తేదీన 2023 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మీడియా సమావేశం ద్వారా టీమిండియాను ప్రకటించనున్నారు. వరల్డ్‌కప్‌కు సంబంధించి దాదాపు 15 మంది టీం ఇండియా ఆటగాళ్ల పేర్లు ఖరారయ్యాయని, అయితే రెండు పేర్లపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భావిస్తున్నారు.
ఆసియా కప్‌లో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు చాలా మంది ప్రపంచకప్‌లో కనిపిస్తారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి.
అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న వారే దాదాపుగా ప్రపంచకప్ జట్టులో ఉండవచ్చని విశ్వసిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial