RR vs RCB Preview: టాప్-4 కోసం ‘రాయల్స్’ కీలక పోరు - రాజస్తాన్‌ను అడ్డుకోకుంటే బెంగళూరుకు కష్టమే!
IPL 2023: ఐపీఎల్ - 2023లో లీగ్ దశ చివరి స్టేజ్‌కు వచ్చేసరికి ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. నేడు రాజస్తాన్ - బెంగళూరులు కూడా టాప్ -4 కోసం పోరాడనున్నాయి.
RR vs RCB Preview: ఐపీఎల్-16 లీగ్ స్టేజ్ ఆల్మోస్ట్ ఎండింగ్ దశలో ఉంది. ప్లేఆఫ్స్ స్టార్ట్ అవడానికి ఇంకా 11 మ్యాచ్ లు మాత్రమే మిగిలినా ఆ దశకు చేరే నాలుగు జట్లపై ఇప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి. టాప్ - 4 లో చోటు దక్కించుకునేందుకు నేడు మరో రెండు జట్లు హోరాహోరి పోరాడబోతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేటి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మొదలయ్యే కీలక పోరులో ‘ఢీ’కొనబోతున్నాయి.
కేజీఎఫ్ ఆడకుంటే అంతే..
ఈ సీజన్‌లో ఆర్సీబీ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ మీద అతిగా ఆధారపడింది. ఆ జట్టు ఇప్పటివరకు చేసిన పరుగులలో 70 శాతం కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ (కేజీఎఫ్) చేసినవే. ఈ ముగ్గురూ ఔటైతే ఆర్సీబీ చాప్టర్ దాదాపు క్లోజ్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. లోమ్రర్, కార్తీక్, అనూజ్ రావత్ లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. మరి నేటి మ్యాచ్ లో అయినా కేజీఎఫ్ కాకుండా మిగిలిన బ్యాటర్లు ఆడతారో లేదో చూడాలి.
బ్యాటింగ్ కథ ఇలా ఉంటే బౌలర్లు కూడా వైఫల్యాల బాటే పడుతున్నారు. ఆర్సీబీ బౌలర్లు ఆ జట్టు ఆడిన గత నాలుగు మ్యాచ్ లలో 180 ప్లస్ పరుగులను ఇచ్చి.. 200 టార్గెట్ ను కూడా కాపాడుకోలేకపోయారు. ప్రత్యర్థి బ్యాటర్ల మీద అరవడం తప్పితే సిరాజ్ గొప్ప ప్రదర్శన చేసింది లేదు. హర్షల్ దీ అదే కథ. గుడ్డిలో మెల్లలా స్పిన్నర్ వనిందు హసరంగ కాస్త బెటర్.
ఫుల్ జోష్‌లో రాజస్తాన్..
ఈ సీజన్ లో ఒకదశలో టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ తర్వాత వరుసగా ముంబై, హైదరాబాద్ చేతిలో ఓడి కష్టాలు కొనితెచ్చుకుంది. కానీ ఇటీవలే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 150 పరుగుల టార్గెట్‌ను 13.1 ఓవర్లలోనే ఊదేసింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సంజూ శాంసన్, బట్లర్ కూడా టచ్ లోనే ఉన్నారు. హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, పడిక్కల్ లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ దృఢంగా ఉంది. గత రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసే అవకాశమే రాని జో రూట్ కు ఇవాళైనా ఆ ఛాన్స్ వస్తుందేమో చూడాలి.
రెండు మ్యాచ్ ల తర్వాత తిరిగి ట్రెంట్ బౌల్ట్ జట్టులో చేరడంతో రాజస్తాన్ బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది. ఈ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన జోష్ లో ఉన్న చాహల్ తో పాటు నిలకడగా రాణిస్తున్న అశ్విన్, సందీప్ శర్మలతో రాజస్తాన్ బౌలింగ్ కు తిరుగులేదు.
When the seas get rough and the going gets tough, we’ll weather the storm and stay the course.
— Royal Challengers Bangalore (@RCBTweets) May 13, 2023
We’ll #PlayBold to reach the shores.#ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/CYFd334eJh
పోటీ ప్లేఆఫ్స్ కోసమే..
ఈ మ్యాచ్‌లో ప్రతీకారాల సంగతి పక్కనబెడితే రెండు జట్లకూ ప్లేఆఫ్స్ రేసు ముఖ్యం. సీజన్ లో ఇప్పటివరకు రాజస్తాన్ 12 మ్యాచ్ లలో ఆరు గెలిచి ఆరింట ఓడి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు టాప్ -4లో ఉన్న లక్నోతో పాటు 3వ స్థానంలో ఉన్న ముంబైని కూడా వెనక్కి నెట్టొచ్చు. 14 పాయింట్లతో ముంబై, రాజస్తాన్ ఉన్నా శాంసన్ సేనకు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టమవుతాయి.
ఇక 11 మ్యాచ్ లు ఆడి ఐదు గెలిచి ఆరు ఓడిన ఆర్సీబీ.. 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ను గెలుచుకుంటే ఆ జట్టు 12 పాయింట్లతో 6వ స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ఓడితే మాత్రం బెంగళూరుకు కష్టమే..
Royals fam, one last Halla Bol at SMS but we don't stop here. 🔥💗 pic.twitter.com/YuJdVOaAUf
— Rajasthan Royals (@rajasthanroyals) May 14, 2023
తుది జట్లు (అంచనా)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, వైశాఖ్ విజయ్ కుమార్, జోష్ హెజిల్వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, జో రూట్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్