అన్వేషించండి

IND vs NED : భారత జోరును నెదర్లాండ్స్‌ అడ్డుకోగలదా..? మళ్లీ అందరి కళ్లు కోహ్లీపైనే

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది.

ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో సగర్వంగా  సెమీఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించి నాకౌట్‌కు ముందు పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాలని చూస్తోంది.  బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో పటిష్టంగా ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం డచ్‌ జట్టుకు అంత తేలిక కాదు.  బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లను నెదర్లాండ్స్‌ బౌలర్లు అడ్డుకోవడం సవాల్‌గా మారనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా లీగ్‌ దశను ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇప్పటివరకు ఒక్క తప్పటడుగూ వేయని రోహిత్‌సేన ఈ పోరులోనూ డచ్‌ జట్టుపై భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
డచ్‌ అడ్డుకోగలదా..?
సెమీఫైనల్‌కు ముందు సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ ఒక్కటే టీమిండియాను  కొంచెం ఆందోళన పరుస్తోంది. నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఫామ్‌ అందుకోవాలని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్లలో సూర్య మాత్రమే పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు.  ఈ మెగా టోర్నీలో సూర్యకుమార్‌ యాదవ్‌ మినహా మిగిలిన టాపార్డర్‌ బ్యాటర్లంతా కనీసం ఒక్క అర్ధశతకమైనా సాధించారు. సూర్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 21.25 సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్లు రోహిత్‌, గిల్‌లు మూడుసార్లు 50పై ఆరంభాలనిచ్చారు కానీ.. మిగతా సందర్భాల్లో ఓపెనర్ల భాగస్వామ్యం త్వరగా విడిపోయింది. ఓపెనింగ్‌లో కూడా భారీ భాగస్వామ్యం నమోదు చేయాలని రోహిత్‌, గిల్‌ భావిస్తున్నారు. టోర్నీలో మరో మూడు మ్యాచ్‌ల్లో రోహిత్‌-గిల్‌ జంట నుంచి బలమైన ఆరంభాలను జట్టు కోరుకుంటోంది. పేసర్లు, స్పిన్నర్లు గొప్పగా రాణిస్తుండడంతో బౌలింగ్‌లో భారత్‌కు ఎలాంటి సమస్యలూ లేవు.
 
కోహ్లీపైనే కళ్లన్నీ...
ఇప్పటికే సచిన్‌ రికార్డుల సెంచరీలను సమం చేసిన కింగ్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును అధిగమించి నవ చరిత్రను సృష్టించాలని భావిస్తున్నాడు. కోహ్లి 50వ వన్డే సెంచరీతో సచిన్‌ టెండూల్కర్‌ను దాటేస్తాడా అన్నదానిపై ఆసక్తి పెంచుతోంది. ఈ ఘనత సాధించడానికి నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ కోహ్లీకి మంచి అవకాశం. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. దక్షిణాఫ్రికాపై శతకంతో సచిన్‌ అత్యధిక శతకాల రికార్డను సమం చేశాడు. నామమాత్ర మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఏమైనా మార్పులు జరుగుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది. వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయోగాలు ఉండవని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. కానీ జట్టులో ఒకట్రెండు మార్పులను కొట్టిపారేయలేం. బుమ్రా, కుల్‌దీప్‌లకు విశ్రాంతినిచ్చి ప్రసిద్ధ్‌ కృష్ణ, అశ్విన్‌లను తీసుకోవచ్చు. 
 
భారత జట్టు: రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, షమి, సిరాజ్‌
 
నెదర్లాండ్స్‌  జట్టు: ఒదౌడ్‌, బారెసి, ఆకర్‌మ్యాన్‌, సిబ్రాండ్‌, ఎడ్వర్డ్స్‌, డి లీడ్‌, తేజ నిడమానూరు, వాన్‌ బీక్‌, వాండెర్‌మెర్వ్‌, ఆర్యన్‌ దత్‌, మీకెరన్‌

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget