Shubman Gill Comments: నేటి నుంచి ఐదో టెస్టు- ఓవల్ పిచ్ క్యూరేటర్‌కు గిల్ చురకలు.. లేని నిబంధనలు అమలు చేస్తున్నాడని ఫైర్
హాట్ హాట్ గా సాగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి అంకానికి వచ్చింది. 31 నుంచి ద ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టు ప్రారంభవుతుంది. ఇంతలో పిచ్ క్యూరెటర్ తో గంభీర్ సంవాదం తెరపైకి వచ్చింది.

Ind Vs Eng Oval Test Latest Updates: ద ఓవల్ పిచ్ క్యూరెటర్ లీ ఫోర్టీస్ పై భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ ఫైరయ్యాడు. ఈ టూర్ లో నాలుగు టెస్టులు ఆడినప్పటికీ, ఫోర్టీస్ లా వేరే ఇతర మైదాన క్యూరెటర్ ప్రవర్తించ లేదని పేర్కొన్నాడు. మంగళవారం పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు. అలాగే గ్రౌండ్ మధ్యలోకి కూలింగ్ బాక్స్ తీసుకు రావద్దని కాస్త రూడ్ గా ప్రవర్తించాడు. దీంతో భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఫోర్టీస్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. తామెప్పటి నుంచే క్రికెట్ ఆడతున్నామని, రూల్స్ విషయం తమకు చెప్పవద్దని గంభీర్ కాస్త ఘాటూగా బదులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫూటేజీ సోషల్ మీడియాలో వైరలైంది. మాజీ క్రికెటర్లతో సహా,క్రికెట్ అభిమానులు ఈ సంఘటనపై షాకయ్యారు. గతంలో ఏ పిచ్ క్యూరెటర్ కూడా ఈ విధంగా ప్రవర్తించాలేదని మండి పడుతున్నారు.
'Levelling the series will be a huge achievement'
— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2025
Shubman Gill ahead of the fifth test 🗣️ #ENGVIND pic.twitter.com/sQZo0ZWS9r
అలాంటి రూల్ లేదే..!
ఇక తాజాగా ఈ ఘటనపై గిల్ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలనే రూల్ లేదని పేర్కొన్నాడు. తాము మాములు షూలను మాత్రమే ధరించామని, ఫోర్టిస్ ఇలా చెప్పడం సరికాదని వ్యాఖ్యానించాడు. స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే పిచ్ పాడయ్యే అవకాశం ఉంటుందని, తాము మాత్రం రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్ తోనే ఉన్నామని, ఫోర్టిస్ ఇలా ఎందుకు చెప్పాడో అర్థం కాలేదని తెలిపాడు.అలాగే ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్టుల వేదికల క్యూరెటర్లు ఇలా ప్రవర్తించ లేదని గుర్తు చేశాడు.
వివాదాలు కొత్తకాదు..
ఇక తొలి రెండు టెస్టుల వరకు సాఫీగా నడిచిన ఈ సిరీస్ ను మూడో టెస్టు నుంచి కాస్త ఉద్రిక్తంగా నడిచింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో ఆట చివర్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు బ్యాటింగ్ చేయడానికి రావడానికి తాత్సారం చేయడం, పదే పదే సమయం వృథా చేయడంతో గిల్ ఫైరయ్యాడు. ఆ తర్వాత భారత బ్యాటింగ్ సమయంలోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు దిగారు. ఇక నాలుగో టెస్టు మాండేటరీ అవర్ తర్వాత మ్యాచ్ ముగిద్దామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రతిపాదించగా, భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తిరస్కరించారు. దీంతో ఇది కూడా వివాదానికి దారితీసింది. మొత్తానికి గత రెండు టెస్టుల నుంచి సిరీస్ హాట్ హాట్ గా సాగుతోంది. తాజాగా దీనికి తోడు పిచ్ క్యూరెటర్ వివాదం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇక పిచ్ వివాదంపై స్పందించేందుకు బెన్ స్టోక్స్ నిరాకరించడం కొసమెరుపు. తనకు అసలు ఈ ఇష్యూ గురించి తెలియదని, తను అక్కడ లేనని మాట దాటేశాడు.




















