IND vs PAK WCL Semi-Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో బిగ్ ట్విస్ట్- పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన భారత స్పాన్సర్
IND vs PAK WCL Semi-Final: భారతదేశం, పాకిస్తాన్ మధ్య సెమీ-ఫైనల్ పోరు కన్ఫామ్ అయిన తర్వాత, EaseMyTrip సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు.

IND vs PAK WCL Semi-Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో ఇండియా ఛాంపియన్స్- పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన గ్రూప్ దశ మ్యాచ్ గతంలో పెద్ద ఎత్తున నిరసనల మధ్య రద్దు అయ్యింది.
జూలై 31న జరగాల్సిన భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ రద్దు అయ్యింది. WCL 2025 సెమీఫైనల్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో జరగాల్సి ఉంది. కానీ భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో ఆడటానికి నిరాకరించారు, దీని కారణంగా మ్యాచ్ రద్దు అయ్యింది. అదే సమయంలో, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం వలన, పాకిస్తాన్ ఆగస్టు 2న బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఫైనల్‌లో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో పాకిస్తాన్ జట్టు తలపడుతుంది.
ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదలైన తర్వాత, పాకిస్తాన్‌తో జరిగే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి భారతదేశం అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్‌లో కూడా, టీం ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదనే అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో, WCL 2025 సెమీఫైనల్ మ్యాచ్ రద్దు చేయడం వలన BCCIపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, ఆసియా కప్‌లో సెప్టెంబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్, EaseMyTrip, తన స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు, లీగ్ దశ ముగిసిన తర్వాత, ఈసారి సెమీ-ఫైనల్స్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌తో తలపడనుంది, అదే స్పాన్సర్ తన వైఖరిని పునరావృతం చేసి మ్యాచ్‌కు అధికారికంగా మద్దతును ఉపసంహరించుకుంది.
ఈజ్‌మైట్రిప్ కీలక ప్రకటన జారీ చేసింది
భారతదేశం- పాకిస్తాన్ మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ ధ్రువీకరించిన తర్వాత, EaseMyTrip సహ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేశారు.
#BREAKING: Indian players have refused to play against Pakistan in the WCL semifinal scheduled for Thursday, sources told IANS pic.twitter.com/mFuFo1409T
— IANS (@ians_india) July 30, 2025
"భారతదేశం vs పాకిస్తాన్ - WCL సెమీ-ఫైనల్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు మేము టీమ్ ఇండియాను అభినందిస్తున్నాము, మీరు దేశాన్ని గర్వపడేలా చేసారు. అయితే, పాకిస్తాన్‌తో జరగబోయే సెమీఫైనల్ కేవలం మరొక ఆట కాదు, టెర్రర్- క్రికెట్ కలిసి ఉండలేవు. EaseMyTrip, మేము భారత్‌కు అండగా నిలబడతాము. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలను సాధారణీకరించడానికి ప్రయత్నించే ఏ ఈవెంట్‌కు మేము మద్దతు ఇవ్వలేము. భారత ప్రజల మాటను మేము వింటాము. WCLలో భారతదేశం vs పాకిస్తాన్ మ్యాచ్‌తో EaseMyTrip సంబంధం లేదు. కొన్ని విషయాలు క్రీడ కంటే పెద్దవి. ఎప్పుడూ దేశమే ముందు వ్యాపారం తర్వాత. జై హింద్." అని పోస్టు చేశారు.
సెమీ-ఫైనల్స్‌కు చివరి నిమిషంలో
🚨 TEAM INDIA SET TO BOYCOTT THE SEMIFINAL AGAINST PAKISTAN IN WCL 🚨
— Tanuj (@ImTanujSingh) July 30, 2025
- The Match is Likely to be Called off. (Sports Today). pic.twitter.com/Q0gd4Hq7YI
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ గ్రూప్ దశలో నిలకడ లేని ఆటతీరుతో ఇండియా ఛాంపియన్స్ సెమీ-ఫైనల్స్‌లో అతి కష్టమ్మీద చోటు సంపాదించుకుంది. చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది.
వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్‌లో టీమిండియా గెలవడానికి 14.1 ఓవర్లలోపు 145 పరుగులు ఛేదించాల్సి వచ్చింది. ఆ జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే ఆ ఘనత సాధించింది, ఒత్తిడిలో కూడా ఆధిపత్య ప్రదర్శన చేసింది.




















