అన్వేషించండి

IND vs AUS, WC Final 2023: గెలిచిన వరల్డ్‌కప్‌ ఏం చేస్తారో తెలుసా? - అది ఎక్కడ ఉంటుందంటే?

IND vs AUS Final: ప్రధాన ట్రోఫీని మాత్రం కేవలం టోర్నీ ముగిసిన సమయంలో విజేతగా నిలిచిన జట్టుకు అందించినా, ఆ తర్వాత మాత్రం దాన్ని తిరిగి తీసుకొని దుబాయ్‌లో ఉంచుతారు.

IND vs AUS Final 2023: అంతర్జాతీయ క్రీకెట్‌ మండలి (ఐసీసీ) నాలుగేళ్లకోసారి నిర్వహించే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ విజేతలకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీ అందించడం పరిపాటే! అయితే ఈ ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారో తెలుసా?

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 1975లో ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభం కాగా.. వరుసగా మూడు సార్లు ఇంగ్లండ్‌లోనే మెగాటోర్నీ జరిగింది. ఆ సమయంలో ట్రోఫీని ‘ప్రూడెన్షియల్‌ కప్‌ ట్రోఫీ’ అని పిలిచేవారు. 1975తో పాటు 1979, 1983లో విశ్వ విజేతగా నిలిచిన జట్లకు ఇదే ట్రోఫీని బహుకరించారు. భారత్‌ తొలిసారి కపిల్‌ దేవ్‌ సారథ్యంలో ప్రపంచకప్‌ అందుకున్న సమయంలో మనకు దక్కిన ట్రోఫీ ఇదే. ఆ తర్వాత 1987లో తొలిసారి భారత్‌ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది. పాకిస్థాన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆ టోర్నీకి ‘రిలయన్స్‌ కప్‌ ట్రోఫీ’ అని నామకరణం చేశారు. ఆ తర్వాత 1992 వరల్డ్‌కప్‌కు ‘బెన్సన్‌, హెడ్జెస్‌ ట్రోఫీ’గా పిలవగా.. 1996లో ‘విల్స్‌ కప్‌ ట్రోఫీ’ అని పేరు పెట్టారు. ఇలా ఒక్కో టోర్నీకి పేరు మార్చడం బాలేదని అనుకున్న ఐసీసీ 1999 నుంచి ఇప్పటి వరకు ఒకే ట్రోఫీని అందిస్తూ వస్తోంది. 

ప్రస్తుతం మూడు వైపులా వికెట్ల నిర్మాణం వంటి దాని మధ్యలో బంతిపై విశ్వం ఉండేలా తీర్చిదిద్దిన ట్రోఫీని 1999, 2003, 07, 11, 15, 19 విజేతలకు అందించారు. అయితే విశ్వ విజేతగా బహుమతి ప్రదాన సమయంలో మాత్రమే ఓరిజినల్‌ ట్రోఫీని చేతికి ఇస్తారు. ఆ తర్వాత దాన్ని తిరిగి దుబాయ్‌లో ఉన్న ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. దీని నమూనా ట్రోఫీ విశ్వ విజేతకు అందిస్తారు. ఒరిజినల్‌ ట్రోఫీ 60 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని బంగారం, వెండితో తయారు చేస్తారు. 

వికెట్ల రూపంలో ఉన్న మూడు పిల్లర్లు.. క్రికెట్‌లో ప్రధాన అంశాలైన బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ను రిప్రజెంట్‌ చేస్తాయి. దీని బరువు దాదాపు 11 కేజీలు కాగా.. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత. గత విజేతల పేర్లను నమోదు చేసేందుకు ఈ ట్రోఫీ కింది భాగంలో ప్రత్యేక బేస్‌ ఏర్పాటు చేశారు. దీనిపై మాజీ చాంపియన్ల పేరును పొందుపరుస్తారు. అయితే ప్రధాన ట్రోఫీని మాత్రం కేవలం టోర్నీ ముగిసిన సమయంలో విజేతగా నిలిచిన జట్టుకు అందించినా.. ఆ తర్వాత మాత్రం దాన్ని తిరిగి తీసుకొని దుబాయ్‌లో ఉంచుతారు. దాని ప్రతి రూపాన్ని మాత్రమే విజేతలకు అందిస్తారు. అచ్చం ప్రధాన ఆలయాల్లో జరిగే ఉత్సవ ఊరేగింపు మాదిరిగానే.. గర్భగుడిలో మూల విరాట్‌ కొలువై ఉంటే.. ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి మాడ వీధుల్లో తిప్పుతారు. ఇది కూడా అంతే.. అసలు ట్రోఫీ దుబాయ్‌లో ఐసీసీ కార్యాలయంలో ఉంటే.. దాని ప్రతిమను విజేత జట్లు తమ దేశానికి తీసుకెళ్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget