News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND Vs AUS: మూడో వన్డేలో భారత జట్టుకు భారీ మార్పులు - చైనా వెళ్లనున్న ఇద్దరు ప్లేయర్లు!

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టీమిండియా తుదిజట్టులో ఎన్నో మార్పులు చేయనుంది.

FOLLOW US: 
Share:

India Squad For Rajkot ODI: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించింది.

కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇండోర్ వన్డేలో టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. కానీ అతను రాజ్‌కోట్‌ వన్డేలో భాగం కానున్నాడు. రాజ్‌కోట్ వన్డేలో జస్‌ప్రీత్ బుమ్రా ఆడడం దాదాపు ఖాయమైంది.

చైనాకు వెళ్లనున్న రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్
భారత జట్టు ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ మూడో వన్డేలో పాల్గొనడం లేదు. వీరు ఆసియా క్రీడల కోసం చైనాకు బయలుదేరుతారు. రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ముఖేష్ కుమార్ కూడా భారత జట్టులో సభ్యుడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్‌ను ఎంపిక చేశారు.

మొహాలీలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో జరిగిన మొహాలీ వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ సిరీస్ రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ తొందరగానే పెవిలియన్ బాట పట్టాడు. ఇండోర్ వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్... రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేశాడు.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో, చివరి వన్డే బుధవారం రాజ్‌కోట్‌ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నారు. దీంతో తుదిజట్టులో మార్పులు జరగడం ఖాయం అయింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 26 Sep 2023 12:58 AM (IST) Tags: Australia ROHIT SHARMA VIRAT KOHLI IND vs AUS IND vs AUS 3rd ODI INDIA

ఇవి కూడా చూడండి

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: ఆసిస్‌ లక్ష్యం 175 , బౌలర్లు కాపాడుకుంటారా?

India vs Australia 4th T20I: ఆసిస్‌ లక్ష్యం 175 , బౌలర్లు కాపాడుకుంటారా?

Ravichandran Ashwin: ఆ టైంలో వాళ్లను చూసి చాలా బాధేసింది: అశ్విన్

Ravichandran Ashwin:  ఆ టైంలో వాళ్లను చూసి చాలా బాధేసింది: అశ్విన్

ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌ కు బెర్త్‌ ఖాయం చేసుకున్న ఉగాండా

ICC T20 World Cup 2024:  టీ20 వరల్డ్‌కప్‌ కు  బెర్త్‌ ఖాయం చేసుకున్న ఉగాండా

India vs Australia 4th T20 match: సమం చేస్తారా, సాధించేస్తారా ..

India vs Australia 4th T20 match: సమం చేస్తారా, సాధించేస్తారా ..

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి