IND vs SL: సంజు శామ్సన్ ఎక్కడైనా ఆడగలడు - ప్రశంసలతో ముంచెత్తిన శ్రీలంక మాజీ క్రికెటర్!
భారత క్రికెటర్ సంజు శామ్సన్‌పై శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు.
Kumar Sangakkara on Sanju Samson: భారత ఆటగాడు సంజు శామ్సన్‌పై శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. ఈ ఆటగాడికి టెంపర్‌మెంట్, పవర్, బాధ్యత ఉందని చెప్పారు. సంజు శామ్సన్ టీమ్ ఇండియాలో ఏ స్థానంలోనైనా బాగా బ్యాటింగ్ చేయగలడని సంగక్కర అభిప్రాయపడ్డారు.
'అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అతను భారతదేశంలో ఎప్పుడు ఆడినా ఏ స్థానంలోనైనా ఆడగలడని నేను అనుకుంటున్నాను. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసు. ఎంత కష్టమైన పరిస్థితిలో అయినా సంజు బాగా ఆడగలడు.’ అన్నారు. టీ20 క్రికెట్‌లో అతను నంబర్-4 స్థానానికి బాగా సరిపోతాడని అభిప్రాయపడ్డారు. తొలి ఏడు ఓవర్లు పూర్తి కాగానే అతను క్రీజులోకి వస్తే మంచిదన్నారు.
శ్రీలంకపై యాక్షన్‌లోకి...
శ్రీలంకతో జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో సంజు శామ్సన్‌ని ప్లేయింగ్-11లో చేర్చాలని భావిస్తున్నారు. అతను చివరిసారిగా ఆగస్టు 2022లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కనిపించాడు. ఇప్పటివరకు సంజు శామ్సన్ 11 వన్డేలు, 16 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో కన్సిస్టెంట్‌గా ఆడకపోవడంతో, సంజు శామ్సన్‌కు జట్టులో చోటు దక్కడం కష్టం అయింది. భారత జట్టులో దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వంటి బలమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉండటంతో సంజూకి అవకాశాలు తగ్గాయి.
View this post on Instagram
View this post on Instagram