అన్వేషించండి

India vs South Africa 2nd Test Innings Highlights: టీమిండియా లక్ష్యం 79 పరుగులు,సునాయసమేనా?

IND Vs SA, Innings Highlights: కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ ముందు దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ ముందు దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 62 పరుగులకు మూడు వికెట్ల నష్టంతో రెండో రోజూ ఆట కొనసాగించిన ప్రొటీస్‌... బుమ్రా ధాటికి 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. రెండోరోజూ ఆటలో అసలు సిసలు ఆటంటే ఐడెన్‌ మార్‌క్రమ్‌దే. వరుసగా వికెట్లు పడుతున్నా మార్‌క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు బుమ్రా వరుసగా వికెట్లు తీస్తున్నా...మరోవైపు ఎదురుదాడికి దిగి ప్రొటీస్‌కు ఆ మాత్రం స్కోరైనా అందించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసిన మాక్రమ్‌... 103 బంతుల్లో 17 ఫోర్లు రెండు సిక్సులతో 106 పరుగులు చేశాడు. ప్రొటీస్‌ చేసిన 153 పరుగుల్లో 106 పరుగులు మార్‌క్రమే చేశాడు. 99 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న మార్క్‌రమ్‌.. సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యం అందించాడు. బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న న్యూలాండ్స్‌ పిచ్‌పై 50 ప్లస్‌ స్కోరు చేసిన తొలి బ్యాటర్‌ మార్‌క్రమే. మిగిలిన బ్యాటర్లు విఫలమవుతున్న చోట మార్‌క్రమ్‌.. బౌండరీలు, సిక్సర్లతో విరుచుపడ్డాడు.

బుమ్రా అదుర్స్‌
సఫారీ బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ముప్పుతిప్పలు పెట్టాడు. ఆరు వికెట్లు నేలకూల్చి దక్షిణాఫ్రికా పతనాన్నిశాసించాడు. బుమ్రా విసిరిన అద్భుతమైన బంతిని ఆడబోయిన వెరీన్‌ (9) సిరాజ్‌ చేతికి చిక్కాడు. దీంతో 85 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్‌ను నష్టపోయింది. మరో బ్యాటర్‌ జాన్సన్‌ను (11) అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌తో (23.5వ ఓవర్) బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం వచ్చిన కేశవ్‌ (2)ను కూడా బుమ్రా ఔట్‌ చేశాడు.

దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశాన్ని భారత్‌(Bharat) చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా 153 పరుగులకే కుప్పకూలింది.  టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0) లను పెవిలియన్‌కు పంపాడు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది.

ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0) లను పెవిలియన్‌కు పంపాడు. చివరి అయిదు వికెట్లు ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్‌ కావడం భారత బ్యాటింగ్‌ లోపాన్ని బయటపెట్టింది.  లుంగి ఎంగిడి,  రబాడ, బర్గర్‌ చెరో మూడు వికెట్లు తీయగా... సిరాజ్‌ రనౌట్‌ అవుట్ అయ్యాడు.  భారత బ్యాటర్లలో కోహ్లీ 46, రోహిత్‌ శర్మ 39, శుభ్‌మన్‌ గిల్ 36 పరుగులతో పర్వాలేదనిపించారు. ఆరుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 98 పరుగుల ఆధిక్యం సాధించింది. 

 దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget