IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు టీబ్రేక్ సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. జో రూట్ (19 బ్యాటింగ్: 38 బంతుల్లో, రెండు ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (6 బ్యాటింగ్: 13 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇంకా 356 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు టీమిండియా 416 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెక్స్ లీస్‌ను (6: 9 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే అవుట్ చేసిన బుమ్రా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9: 17 బంతుల్లో, ఒక ఫోర్), ఓలీ పోప్ (10: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
జో రూట్, జానీ బెయిర్‌స్టో మరో నాలుగు ఓవర్ల వరకు వికెట్ పడకుండా కోల్పోయారు. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేసి టీ బ్రేక్‌ను ప్రకటించారు. వర్షం ఆగడంతో మ్యాచ్ కాసేపట్లో తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. భారత బౌలర్లలో తీసిన మూడు వికెట్లూ బుమ్రాకే దక్కాయి.
View this post on Instagram
View this post on Instagram