అన్వేషించండి

Ind Vs Eng 4th Test Toss Update: ఇండియా బ్యాటింగ్.. అన్షుల్ అరంగేట్రం.. జ‌ట్టులో 3 మార్పులు.. స‌మ‌రోత్సాహంలో ఇంగ్లాండ్

5 టెస్టుల అండ‌ర్స‌న్-టెండూల్క‌ర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ఇరుజ‌ట్ల‌కు కీల‌కం. ఇరుజ‌ట్లు కూడా ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్నాయి. పిచ్ బౌల‌ర్ల‌కు కాస్త అనుకూలంగా ఉంటుంది.

Ind Vs Eng Manchestar Test Updates:  ఇంగ్లాండ్ తో మాంచెస్ట‌ర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డు వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టులో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. బుధ‌వారం ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్  బౌలింగ్ ఎంచుకున్నాడు. కీల‌క‌మైన ఈ మ్యాచ్ కోసం ఇరుజ‌ట్లు మార్పులు చేశాయి. ముఖ్యంగా ఇండియా గాయ‌ప‌డిన తెలుగు కుర్రాడు, పేస్ ఆల్ రౌండ‌ర్ నితీశ్ రెడ్డి స్థానంలో మ‌రో ప్లేయ‌ర్ శార్దూల్ ఠాకూర్ ను జ‌ట్టులోకి తీసుకుంది. ఇక స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడ‌నున్నాడు. 24 ఏళ్ల కుర్ర పేస‌ర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేయ‌నున్నాడు. అలాగే వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ స్థానంలో లెఫ్టాండర్ సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ లో ఒక మార్పు చేసింది. గాయ‌ప‌డిన షోయ‌బ్ బ‌షీర్ స్థానంలో లియామ్ డాస‌న్ ను జ‌ట్టులోకి తీసుకుంది. ఇక ఈ వేదిక స్వింగ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండ‌టంతో అటు బ్యాట్ కు ఇటు బంతికి స‌మ‌తూకం ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ వేదికపై ఇండియా ఎప్పుడూ గెలవకపోవడంతో.. ఈసారి లెక్క సరి చేయాలని భావిస్తోంది. 



 

అనూహ్య మార్పులు..
ఇక గెలుపే టార్గెట్ గా బ‌రిలోకి దిగిన ఈ మ్యాచ్ లో కొన్ని మార్పుల‌తో భార‌త్ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ముఖ్యంగా వెట‌ర‌న్ క‌రుణ్ స్థానంలో సాయి సుద‌ర్శ‌న్ ను జ‌ట్టులోకి తీసుకుంది. అనుభ‌వం కంటే కూడా ఫామ్ నే దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఉంది. ఇప్ప‌టికే మూడు టెస్టులు ఆడిన క‌రుణ్.. కంబ్యాక్ లో అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఆరు ఇన్నింగ్స్ లలో క‌లిపి 131 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో సుద‌ర్శ‌న్ ను జ‌ట్టులోకి తీసుకుంది. మ‌రోవైపు శార్దూల్ ను తీసుకుని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నితీశ్ బ్యాటింగ్ ఆల్ రౌండ‌ర్ కాగా, శార్దూల్ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్. తొలి టెస్టులో త‌ను విఫ‌లం కాగా, ఈ మ్యాచ్ లో ఆక‌ట్టుకోవాల‌ని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. 

నాలుగోసారి టాస్ ఓడిన గిల్..
ఇక కెప్టెన్ గా ఈ సిరీస్ లోనే బాధ్య‌త‌లు తీసుకున్న శుభ‌మాన్ గిల్.. ఈ మ్యాచ్ లోనూ టాస్ గెల‌వ‌లేదు. వ‌రుస‌గా నాలుగోసారి కూడా టాస్ ఓడిపోయాడు. మ‌రోవైపు టాస్ గెలిచిన స్టోక్స్ .. మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో బౌలింగ్ తీసుకున్నాడు. ఈ వేదిక‌పై ఫ‌స్ట్ బౌలింగ్ చేసిన రికార్డు లేక‌పోయిన‌ప్ప‌టికీ, త‌మ జ‌ట్టుపై ఉన్న విశ్వాసంతో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు. తొలి రోజు క్లౌడ్ క‌వ‌ర్ ఉండ‌టంతోపాటు పిచ్ కాస్త బౌలర్ల‌కు స‌హ‌క‌రిస్తుండ‌టంతో స్టోక్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా అనుల్ కాంబోజ్ అరంగేట్రం చేశాడు. చివ‌రిసారి ఈ వేదిక‌లో దిగ్గ‌జం అనిల్ కుంబ్లే అరంగేట్రం చేయ‌గా.. ఇప్పుడే అదే ఇన్షియ‌ల్ (ఏకే) గ‌ల కాంబోజ్ కూడా డెబ్యూ చేయ‌డం విశేషం. మ‌రో వైపు అంత‌ర్జాతీయ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ లో ప‌దికి ప‌ది వికెట్ల‌ను కుంబ్లే తీయ‌గా, డొమెస్టిక్ లో కాంబోజ్ ఒక ఇన్నింగ్స్ లో ప‌దికి ప‌ది వికెట్లు తీయ‌డం విశేషం. తను కూడా కుంబ్లేలాగా రాణించాల‌ని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget