IND vs ENG 3rd ODI Highlights: హర్మన్‌ప్రీత్ కౌర్ ఫాస్టెస్ట్ సెంచరీ, క్రాంతి గౌడ్ 6 వికెట్ల ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్ కైవసం.
Harmanpreet Kaur Records | భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 82 బంతుల్లోనే శతకం సాధించింది. సెంచరీల జాబితాలో మిథాలీ రాజ్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచింది.

India vs England 3rd odi highlights: భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి తాను గేమ్ ఛేంజర్ అని, విధ్వంసకర బ్యాటర్ అని నిరూపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో ఆమె కేవలం 84 బంతుల్లో 102 పరుగులు చేసి సత్తా చాటింది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా కౌర్ నిలిచింది. ఈ వన్డేలో కౌర్ సెంచరీకో తోడు క్రాంతి గౌడ్ అద్భుతమైన బౌలింగ్ తో మూడో వన్డేలో టీమిండియా విజయంతో ఇంగ్లాండ్ పై సిరీస్ తమ ఖాతాలో వేసుకుంది.
మంగళవారం జరిగిన మూడవ వన్డేలో, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీ (102) సాధించగా, జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ (50) చేసింది. చివర్లో రిచా ఘోష్ 18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో భారత స్కోరు 318కి చేరింది. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో చారిత్రాత్మక స్పెల్ తో ఇంగ్లాండ్ 305 పరుగులకు ఆలౌట్ అయింది. క్రాంతి గౌడ్ 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. దాంతో భారత జట్టు 2-1తో ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
మిథాలీ రికార్డు బ్రేక్ చేసినా రెండో స్థానంలోనే..
హర్మన్‌ప్రీత్ కౌర్ తాజా మ్యాచ్‌లో 82 బంతుల్లో సెంచరీ సాధించింది. ఇది వన్డే క్రికెట్‌లో భాతర మహిళా బ్యాటర్ చేసిన రెండో వేగవంతమైన సెంచరీ. ఈ సంవత్సరం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన 70 బంతుల్లో చేసిన సెంచరీ భారత్ నుంచి ఫాస్టెస్ట్ గా ఉంది. అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. కానీ ఆమె మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సరసన చేరింది. ఇది హర్మన్ వన్డే కెరీర్‌లో 7వ సెంచరీ. మిథాలీ రాజ్ 232 మ్యాచ్‌లలో 7 శతకాలు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కేవలం 149 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. తక్కువ మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు సాధించి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును దాటింది.
మూడో వన్డేలో భారత్ అద్భుతమైన బ్యాటింగ్
మాంచెస్టర్‌లోని లీ స్ట్రీట్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. స్మృతి మంధాన, ప్రతీకా రావల్ 26-26 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన హర్లీన్ డియోల్ 45 పరుగులతో రాణించింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. 14 ఫోర్ల సాయంతో ఆమె 102 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. మరో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కూడా అర్ధ సెంచరీ చేయగా, రిచా ఘోష్ వేగంగా 38 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు సిరీస్ 1-1తో సమంగా ఉండగా.. సిరీస్ నెగ్గాలంటే కచ్చితంగా గెలవాల్సిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. భారత్ మొదటి మ్యాచ్ గెలవగా, రెండో మ్యాచ్ ఇంగ్లండ్ నెగ్గింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళలు సత్తా చాటారు.
స్మృతి మంధాన రికార్డులు
వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన మహిళా బ్యాటర్ స్మృతి మంధాన. ఆమె 105 వన్డే మ్యాచ్‌ల్లోనే ఏకంగా 11 సెంచరీలు చేసింది. ఈ జాబితాలో హర్మన్‌ప్రీత్, మిథాలీ ఇప్పుడు ఏడు సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నారు.





















