అన్వేషించండి

IND vs AFG: తొలి టీ 20లో టీమిండియా ఘన విజయం, మెరిసిన శివమ్‌ దూబే

IND Vs SA, 1st T20: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ 20లో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత అఫ్గాన్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

అఫ్గానిస్థాన్‌( Afghanistan)తో జరిగిన తొలి టీ 20లో భారత్‌(Bharat) ఘన విజయం సాధించింది. తొలుత అఫ్గాన్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌... నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం  11 బంతులు మిగిలి ఉండగానే రోహిత్‌ సేన విజయం సాధించింది.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్‌... భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ తో పాటూ ముఖేష్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘానిస్తాన్‌ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం అందించారు.. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. అదే స్కోర్ వద్ద మరో ఓపెనర్ ను శివమ్‌ దూబే పెవిలియన్ కు పంపాడు. దీనితో 50 పరుగుల వద్ద ఒక్క వికెట్‌ కోల్పోకుండా పటిష్టంగా కనిపించిన అఫ్గాన్‌.. అదే స్కోరు వద్ద  రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఒమ్రాజాయ్‌ 22 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మహ్మద్ నబీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో అఫ్గాన్‌ పోరాడే స్కోరును సాధించింది. 27 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. నబీని ముఖేశ్‌ కుమార్‌ అవుట్ చేశాడు .మిగిలిన బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. టీం ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
 
దూబే అర్ధ శతకం
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్లోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. 14 నెలల తర్వాత టీ 20ల్లో బరిలోకి దిగిన సారధి రోహిత్‌ శర్మ.. ఒక్క పరుగు కూడా చేయకుండానే  పెవిలియన్‌ చేరాడు. సమన్వయ లోపం కారణంగా రోహిత్‌ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒక్క పరుగు చేయకుండానే.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకుండానే హిట్‌ మ్యాన్‌ పెవిలియన్‌ చేరాడు. కానీ శుభమన్‌ గిల్‌, తిలక్‌ వర్మ భారత్‌ను ఆదుకున్నారు. ఉన్నంత సేపు గిల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 12 బంతుల్లో అయిదు ఫోర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్‌ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 26 పరుగులు చేశాడు. భారత్‌ విజయం దిశగా సాగుతున్న సమయంలో మరో రెండు వికెట్లు నేలకూలాయి. కానీ శివమ్‌ దూబే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
 
కేవలం 40 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సులతో దూబే 60 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాకు విజయాన్ని అందించాడు. దూబేకు జితేశ్‌ శర్మకు చక్కటి సహకారం అందించాడు. కేవలం 20 బంతుల్లో అయిదు ఫోర్లతో జితేశ్‌ 31 పరుగులు చేశాడు. చివర్లో నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ మెరుపు ముగింపును ఇచ్చాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులు చేశాడు. శివమ్ దూబే, జితేశ్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో టీమిండియా 17.3 ఓవర్లలోనే మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 60 పరుగులతో పాటు ఒక వికెట్‌ను కూడా నేలకూల్చిన శివమ్‌ దూబే... మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

టాప్ హెడ్ లైన్స్

BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget