అన్వేషించండి

ODI World Cup 2023: భారత్‌పై 5 వికెట్లు తీస్తా , షహీన్‌ షా అఫ్రీదీ ప్రతిన

ODI World Cup 2023: దాయాదుల మధ్య పోరు ఎప్పుడు జరిగినా ప్రతీ క్షణం ఉత్కంఠగా సాగుతుంది. ఆటగాళ్ల కవ్వింపులు మ్యాచ్‌ను మరింత ఉద్విగ్నంగా మారుస్తాయి.

భారత్‌-పాక్ మ్యాచ్‌ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. దీనిని మ్యాచ్‌లాకాక ఓ యుద్ధంలా చూస్తారు. అందుకే దాయాదుల మధ్య పోరు ఎప్పుడు జరిగినా ప్రతీ క్షణం ఉత్కంఠగా సాగుతుంది. ఆటగాళ్ల కవ్వింపులు మ్యాచ్‌ను మరింత ఉద్విగ్నంగా మారుస్తాయి. ఇరువైపుల ఆటగాళ్లు మాటలతో ఒకరిని ఒకరు కవ్వించుకుని పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. రేపు(శనివారం) గుజరాత్‌లోని  అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాక్‌ మధ్య హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందే ఇరువైపుల ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాక్ స్పీడ్‌ స్టార్‌ షాహీన్‌ షా అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అయిదు వికెట్లు నేలకూలుస్తానని  షాహీన్‌ ఆఫ్రిదీ అతిపెద్ద ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

 భారత్‌పై 5 వికెట్లు తీస్తాను అంటూ భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు షాహీన్ ఆఫ్రిది చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ ప్రకటనతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. తొలిసారి భారత్‌ గడ్డపై మ్యాచ్‌ ఆడేందుకు వచ్చిన షాహీన్ అఫ్రిది.. భారత్‌పై 5 వికెట్లు తీస్తానని ప్రకటించాడు. కొత్త బంతితో షాహీన్‌ షా అఫ్రీదీని ఎదుర్కోవడంలో భారత్‌ కాస్త ఇబ్బంది పడినట్లు గత రికార్డులు చెబుతున్నాయి. ఈసారి కొత్తబంతితో షాహీన్‌ వేసే స్వింగ్‌ను టీమిండియా బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారత టాపార్డర్‌లో ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంతో కొంచెం ఇబ్బంది పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ అది కనిపించింది. ఇప్పటివరకూ 46 వన్డేలు ఆడిన షాహీన్‌ షా అఫ్రీదీ కేవలం రెండుసార్లు మాత్రమే 5 వికెట్లు పడగొట్టాడు. 
 కానీ ఈ ప్రపంచకప్‌లో షాహీన్‌ షా పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆసియా కప్‌లో షాహీన్ అఫ్రిది టీమ్ ఇండియాతో రెండు మ్యాచ్‌లు ఆడాడు. తొలి మ్యాచ్‌లో షాహీన్ 10 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను అఫ్రీదీ అవుట్ చేశాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత సూపర్-4 దశలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌పై షాహీన్ పూర్తిగా వెలవెలబోయాడు. 7.90 ఎకానమీతో 10 ఓవర్లలో 79 పరుగులు ఇచ్చాడు. భారత్‌పై ఇప్పటివరకూ మూడు వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్‌ స్పీడ్‌ స్టార్‌... 31.20 సగటుతో 5 వికెట్లు తీసుకున్నాడు. 

వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం సాధించి రికార్డును మరింత పెంచాలని పట్టుదలతో ఉంది.

Also Read: దాయాదుల పోరుకు ముందు మ్యూజికల్‌ కాన్సర్ట్‌

Also Read: వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ సూపర్ రికార్డు - 8-0పై కన్నేసిన టీమిండియా!

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget