Hardhik Pandya: విడాకుల తర్వాత తొలిసారి కొడుకుతో, పాండ్య ఆనందం అంతా ఇంతా కాదు!
Hardhik Pandya: నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్యను మొదటిసారి కలుసుకున్న వీడియో వైరల్ గా మారింది.
Hardhik Pandya Met His Son Agasta: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) పుత్రోత్సాహంలో మునిగిపోయాడు. విడాకులు అయి నటాషా వెళ్ళిపోయిన దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారి తన కొడుకు అగస్త్య(Agastya)ను కలిశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
రెండు నెలల తర్వాత అగస్త్యను చూసిన పాండ్యా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మురిపెంగా అగస్త్యను ఎత్తుకున్న పాండ్యా ముఖం తారాజువ్వాలా వెలిగిపోయింది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ 2020లో మొదటిసారి వివాహం చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. తరువాత పిల్లాడి సమక్షంలో మరోసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు హార్దిక్- నటాషా. నాలుగేళ్ళు అంతా బాగానే ఉంది. అయితే చాలా కాలంగా వీరిద్దరి మధ్య సయోధ్య లేదంటూ వార్తలు వచ్చాయి. జూలై 19న వారు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భార్యా భర్తలుగా విడిపోయినా కో-పేరెంట్స్‌గా అగస్త్యకి తాము చేయాల్సిందంతా చేస్తామని ఇద్దరూ వెల్లడించారు. దీని తరువాత, అగస్త్య ను నటాషా తన స్వదేశం అయిన సెర్బియాకు తీసుకు వెళ్లింది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకున్న చాలా కాలం తర్వాత డు అగస్త్యను కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం నటాషా ముంబైలో తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్ తో షికారు చేస్తున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
Reunited 🥹🫶🤍 pic.twitter.com/szZ2PpBCcl
— Hardiklipsa (@93Lipsa) September 21, 2024
ఇక పాండ్య కెరియర్ విషయానికి వస్తే టెస్టులకు దూరమైన హార్దిక్ పాండ్యా వన్డేలు, టీ20ల్లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు. 2018లో చివరి సారిగా టెస్టు ఆడాడు హార్దిక్. అయితే ఇప్పుడు మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో తిరిగి టెస్టు జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాగే టెస్టు జట్టులోకి రావాలంటే ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. ఈ నేపథ్యంలోనే పాండ్యా దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. బరోడా తరపున అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉందని సమాచారం.