అన్వేషించండి

Gongadi Trisha Grand Welcome: హైదరాబాద్ చేరుకున్న త్రిష.. తనకు స్ఫూర్తి ఎవరంటే..?

Gongadi Trisha: గత ఎడిషన్ లో అంతగా అవకాశాలు రాలేదని, ఈసారి వచ్చిన చాన్స్ యూజ్‌ చేసుకున్నట్లు త్రిష తెలిపింది. చాలా రోజుల నుంచే ప్రిపేరయ్యామని, మలేసియా పిచ్‌లపై అవగాహన ఉండటంతో తేలికైందని తెలిపింది.

U19 Women T20 World Cup: ఇటీవల మలేసియాలో ముగిసిన అండర్ - 19 మహిళా టీ20 ప్రపంచకప్ లో సంచలనం రేపిన తెలంగాణ ప్లేయర్ గొంగడి త్రిష మంగళశారం స్వదేశానికి చేరుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు, క్రికెట్ ప్రేమికులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెతోపాటు మరో క్రికెటర్ ధ్రుతి కేసరి, హెడ్ కోచ్ నూషిన్, ట్రైనర్ శాలిని తదితరులక స్వయంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం చీఫ్ జగన్మోహన్ రావు స్వాగతం తెలిపారు. అనంతరం వారిని సన్మానించారు.  ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ.. గత ఎడిషన్ లో పాల్గొన్నా, తనకు అంతగా అవకాశం రాలేదని, ఈసారి మాత్రం వచ్చిన చాన్స్ లను రెండు చేతులతో అందింపుచ్చుకున్నట్లు తెలిపింది. మలేసియాలో చాలా రోజుల  నుంచే ప్రిపేరయ్యామని, అక్కడి పిచ్ లపై అవగాహన ఉండటంతో ప్రపంచకప్ లో ఆడటం తేలికైందని తెలిపింది. ఆదివార కౌలాలంపూర్ లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 9 వికెట్లను భారత్ ఓడించిన విజేతగా నిలిచింది. 2023 టోర్నీ ఆరంభ ఎడిషన్ లోనూ గెలిచిన భారత్.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకుంది. 

నాన్నే స్పూర్తి..
తను ఇంత ఎత్తుకు ఎదగడం వెనకాల తన తండ్రి అకుంఠిత ధీక్ష ఉందని త్రిష తెలిపింది. చిన్నప్పటి నుంచి తన లక్ష్యం కోసం తను ఎంతగానో కష్టపడ్డాడని తెలిపింది. తన కుటుంబం కూడా ఎంతో సపోర్టుగా నిలిచిందని పేర్కొంది. అలాగే హైదరాబాదీ మహిళా దిగ్గజం మిథాలీ రాజ్ క్రికెటర్లలో తనకు స్ఫూర్తి అని త్రిష పేర్కొంది. చిన్నప్పటి నుంచి తన ఆట చూస్తూ పెరిగానిని, తన ఆట అంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. ఇక తాజా టీ20 ప్రపంచకప్ లో త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఫైనల్లో 44 పరుగులతో అజేయంగా నిలవడంతోపాటు మూడు వికెట్లు తీసి ఆల్ రౌండ్ షో ప్రదర్శించింది. తను 2023 ఎడిషన్ లోనూ పాల్గొంది. 

త్రిషకు అరుదైన గౌరవం..
ప్రపంచప్ లో సత్తా చాటి జోరు మీదున్న త్రిషకు మరో గౌరవం దక్కింది. తాజాగా మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన జట్ల నుంచి ఐసీసీ ఎంపిక చేసిన టీమ్‌లో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది.  గొంగడి త్రిషతో పాటు కమలిని, ఆయూషి, వైష్ణవి ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఈ కప్‌లో 147పైన స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికైన త్రిష.. స్కాట్లాండ్‌పై శతకం బాదింది. ఈ కప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. టోర్నీ ఆసాంతం త్రిషకు మద్దతుగా నిలిచిన మరో ఓపెనర్‌ కమలిని 143 పరుగులు సాధించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో కమలిని (56) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు వైష్ణవి (17 వికెట్లు), ఆయూషి (14 వికెట్లు) బంతితో సత్తా చాటారు. కైలా రేనెక్ ను ఈ జట్టుకు సారథిగా ఐసీసీ ఎంపిక చేసింది. ఆమెతోపాటు, యెమా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెరిన్, కేథి జోన్స్‌ (ఇంగ్లాండ్‌), కోయ్‌మి బ్రే (ఆస్ట్రేలియా), చమోది (శ్రీలంక), పూజ మహతో (నేపాల్‌) కూడా ఈ జట్టుకు ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికాకి చెందిన నిని 12వ ప్లేయర్‌ గా ఎంపికైంది.  

Also Read: Abhishek Record: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్.. టీ20ల్లో ఇంగ్లాండ్ పై హయ్యెస్ట్..

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget