అన్వేషించండి
Advertisement
Manoj Tiwary: బయటకు రా చూసుకుందాం, గంభీర్-మనోజ్ తివారీ గొడవ!
Manoj Tiwary: తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన తివారీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ఘనంగా సన్మినించింది.
Manoj Tiwary Retairment : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary ) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన తివారీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ఘనంగా సన్మినించింది. అతడిని గోల్డెన్ బ్యాట్‌తో బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సత్కారించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్‌ల రిటైర్మెంట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ నా కెరీర్‌లో బెంగాల్‌కు రంజీ ట్రోఫీని అందించికపోవడం లోటుగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. రిటైర్‌మెంట్ తర్వాత మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు గౌతం గంభీర్‌తో జరిగిన గొడవను గుర్తు చేసుకుని బాధపడ్డాడు.
ఇంతకీ ఏమైందంటే...
రంజీ ట్రోఫీ గౌతమ్ గంభీర్‌తో మైదానంలో జరిగిన వాగ్వాదమే తన జీవితంలో బాధపడ్డ ఘటన అని మనోజ్ తివారీ గుర్తు చేసుకున్నాడు. గౌతమ్ గంభీర్‌తో ఆ రోజు మైదానంలో వాగ్వాదంపై ఇప్పటికీ బాధపడుతుంటానని అన్నాడు. తన సంబంధికులు, సన్నిహితులు, మిత్రులు చాలామంది గ్రౌండ్‌లో అలా ఎలా ప్రవర్తించావని అడుగు తుంటారని అన్నాడు. తాను ఎవరితోనూ వాగ్వాదం చేయడానికి ఇష్టపడనని.. సీనియర్లకు చాలా మర్యాద ఇస్తానని మనోజ్ తివారీ గుర్తు చేసుకున్నాడు. కానీ గంభీర్‌తో రంజీ ట్రోఫీలో గొడవఎందుకంటే దాని వల్లే నాకున్న మంచి పేరు నాశనమైందన్నాడు. తమ మధ్య ఒకదశలో బలమైన బంధం ఉండేదని... అలాంటిది తామిద్దరం గొడవకు దిగడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నప్పుడు తుది జట్టు గురించి గంభీర్ తాను తీవ్రంగా చర్చించుకునేవాళ్లమని.. అయినా రంజీ మ్యాచ్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందిని తివారి వివరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బయట కలవమని గంభీర్ చెప్పాడని... ఇవాళ అయిపోయావు నువ్వు అన్నాడని కూడా తివారీ తెలిపాడు. తాను ఓకే అంటూ నవ్వేశానని తెలిపాడు. కానీ తాను బయట కలవలేదని వెల్లడించాడు. తాను ఏ తప్పు చేయలేదని భావిస్తానని. కానీ, అలా జరగకుండా ఉంటే బాగుండేదని మనోజ్ తివారీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
అతడి వల్లే నా కెరీర్ నాశనం
తనకు వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే కోహ్లీ, రోహిత్‌లా స్టార్ ప్లేయర్ అయ్యేవాడినని అభిప్రాయపడ్డాడు. సెంచరీ తర్వాత తనను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారనే విషయంపై ధోనీని నిలదీయాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లి, రోహిత్‌శర్మ పరుగులు చేయకపోయినా జట్టుకు ఎంపిక చేసి.. తనను ఎందుకు తప్పించారని ధోనీని అడుగుతానని మనోజ్ తివారి అన్నాడు. ధోనీని ఎప్పుడు కలిసినా.. వరుసగా 14 మ్యాచ్‌లు తనను ఎందుకు దూరంగా ఉంచారని అడుగుతానని తివారి తెలిపాడు. కోహ్లి, రోహిత్, సురేశ్ రైనా పరుగులు చేయకపోయినా 2012 ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసి.. తనను పక్కనబెట్టడాన్ని ప్రశ్నిస్తానని తెలిపాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion