అన్వేషించండి

Ind Vs Eng 1st T20: రాణించిన భారత బౌలర్లు - బట్లర్ ఫిఫ్టీతో ఒంటరి పోరాటం, ఇంగ్లాండ్ 132 ఆలౌట్

Kolkata T20i: బౌలర్లు రెచ్చిపోవడంతో కోల్‌కతా తొలి టీ20లో ఇంగ్లాండ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు కుదేలయ్యారు.

Kolkata T20i Live Updates: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లాండ్ తేలిపోయింది. భారత బౌలర్ల ధాటికి సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. జట్టులో జోస్ బట్లర్ స్టన్నింగ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 68, 8 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడగా, అతనికి సహాకారం అందించేవారు కరువయ్యారు. టీమ్‌లో హారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండెంకెల స్కోరు చేసిన బ్యాటర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో ప్రత్యర్థి పనిపట్టాడు. అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లతో సత్తా చాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అటు పేస్, ఇటు స్పిన్‌తో ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఏ దశలోనూ ఆ జట్టు భారీ స్కోరు వైపు పయనం సాగలేదు. 

అదరగొట్టిన అర్షదీప్..
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్టింగ్‌లోనే రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను అర్షదీప్ చావుదెబ్బ తీశాడు. దీంతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు యజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు) పేరుతో ఉండగా, 97 వికెట్లతో అర్షదీప్ తిరగరాశాడు. చాహల్ 80 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా, కేవలం 61 మ్యాచ్‌ల్లోనే అర్షదీప్ తన రికార్డును అధిగమించాడు.

ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఇన్నింగ్స్ మూడో బంతికే అర్షదీప్ ఔట్ చేశాడు. షార్ట్ ఆఫ్ లెంగ్త్ బాల్‌ను ఆడటానికి ప్రయత్నించిన సాల్ట్.. బంతి కాస్త మూవ్ కావడంతో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరికాసేపటికే డేజంర్ బెన్ డకెట్ (4)ను కూడా అర్షదీప్ పెవిలియన్‌కు పంపాడు. బంతిని మిడ్ వికెట్ దిశగా ఫ్లిక్ చేయాలని భావించిన డకెట్.. కవర్స్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెనక్కి పరిగెత్తుకుంటూ షోల్డర్ లెవల్లో వచ్చిన బంతిని రింకూ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 

బట్లర్ ఫైటింగ్ ఫిప్టీ..
ఈ దశలో జోస్ బట్లర్, హారీ బ్రూక్ (17) వికెట్ల పతనాన్ని కాసేపు ఆపారు. వికెట్లు పడినా కూడా ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరు సత్ఫలితాన్ని సాధించారు. ముఖ్యంగా బ్రూక్ తొలుత రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌తో సత్తా చాటాడు. అలాగే బట్లర్ కూడా బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు ఈ జంట 48 పరుగులు జోడించింది. ఈ దశలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కమాల్ చేశాడు. ఒకే ఓవర్లో బ్రూక్‌తో పాటు లియామ్ లివింగ్ స్టన్‌ను డకౌట్ చేసి షాకిచ్చాడు.

ముందుగా చక్రవర్తి వేసిన బంతి కాస్త ఎక్కువగా రిఫ్ట్ అయ్యి బ్రూక్ బ్యాట్ అండ్ ప్యాడ్ గ్యాప్‌లో నుంచి బయటకు వచ్చి, వికెట్లను గిరాటేసింది. అంతకుముందు ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఆ తర్వాత తను ఎదుర్కొన్న రెండో బంతికే లివింగ్ స్టన్ పెవిలియన్‌కు చేరాడు. బంతిని డ్రైవ్ చేయడానికి లివింగ్ స్టన్ ప్రయత్నించగా, బంతి టర్న్ అయ్యి, వికెట్లకు తాకింది. దీంతో నాలుగో వికెట్‌ను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఒకవైపు బట్లర్ ఒంటరి పోరాటం చేస్తూ 34 బంతుల్లోనే అర్థ సెంచరీ చేయగా, అతనికి సహకారం అందిచేవారు కరువయ్యారు. స్లోగా ఆడిన జాకబ్ బెతెల్ (14 బంతుల్లో 7)ను హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. బంతిని పుల్ చేసి అభిషేక్ శర్మ చేతికి చిక్కడంతో బెతెల్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే బట్లర్ కూడా ఔటవడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. చివర్లో ఆర్చర్ కాస్త బ్యాట్ ఝుళిపించి, విలువైన పరుగులు చేశారు.

Also Read: BCCI Vs ICC: బీసీసీఐ, ఐసీసీ.. డిష్యూం డిష్యూం! పట్టు విడవని ధోరణిలో భారత బోర్డు, రెండు అంశాలపై పీఠముడి!

టాప్ హెడ్ లైన్స్

Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget