అన్వేషించండి

ENG vs NED: పరువు కోసం ఇంగ్లండ్‌ పోరాటం, నెదర్లాండ్స్‌ పై అయినా గెలుస్తారా?

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో రేపు మరో నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్‌ తలపడనుంది.

ప్రపంచకప్‌లో రేపు మరో నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్‌ తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్‌ అవకాశాలు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా మారింది. కానీ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ విజయం సాధిస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. .పాయింట్ల పట్టికలో టాప్ ఏడు జట్లు, ఆతిథ్య పాకిస్థాన్ మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుందని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలను కూడా కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు... నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లపై మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలని భావిస్తోంది. కాగితంపై చాలా ప్రమాదకరంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు, విశ్వాసం, ఫామ్ కోల్పోయి కష్టాలు పడుతోంది. 
 
ప్రపంచ కప్‌లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక విజయాన్ని మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఏ ఇంగ్లండ్ జట్టు కూడా ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని బ్రిటీష్‌ జట్టు చూస్తోంది. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌కు కాస్తైన పరువు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఇంగ్లండ్‌ బ్యాటింగ్ ఈ ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ ఆశించిన ఆరంభాన్ని ఇవ్వడం లేదు. జో రూట్ క్రీజులో నిలబడడం లేదు. జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ ఫామ్‌లో లేరు. ఇలా బ్రిటీష్‌ బ్యాటర్లు అంతా ఘోరమైన ఫామ్‌లో ఉన్నారు. వీరు ఈ మ్యాచ్‌లో అయినా రాణించాలని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ఇంగ్లండ్ బౌలింగ్ మాత్రం పర్వాలేదనిపిస్తోంది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్లు నిలకడగా రాణించారు. డేవిడ్ విల్లీ ఈ మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడంతో, హ్యారీ బ్రూక్, శామ్ కరణ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. 
 
ఇటు నెదర్లాండ్స్ ఏడు మ్యాచుల్లో రెండు విజయాలు, అయిదు పరాజయాలతో నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌కు ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోవడానికి ఇది సువర్ణావకాశం. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై డచ్‌ జట్టు విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌పై కూడా అద్భుతం చేయాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. ఆల్‌రౌండర్లతో నిండిన నెదర్లాండ్స్ తాము గెలవగలమని ఇప్పటికే నిరూపించింది. టాప్ ఆర్డర్, బౌలింగ్ మరింత నిలకడగా రాణిస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. 
 
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కరణ్‌, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. 
 
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), కోలిన్ అకెర్మాన్, వెస్లీ బరేసి, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, ర్యాన్ క్లైన్, తేజా నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, విక్రమ్‌జిత్ సింగ్

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget