Virat Kohli: 2022 నుంచి తిరుగులేని ఫాంలో కింగ్ కోహ్లీ - ప్రతి టోర్నీలో టాప్ స్కోరర్‌గా!
2022లో తిరిగి ఫాంలోకి వచ్చిన దగ్గర నుంచి విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు.
Virat Kohli Stats: 2019 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లికి బ్యాడ్ టైం నడిచింది. టెస్ట్, వన్డే, టీ20 ఇంటర్నేషనల్... ఇలా మూడు ఫార్మాట్‌లలో అతని బ్యాట్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. చాలా మంది మాజీ క్రికెటర్లు అతను క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. అయినా విరాట్ కోహ్లీ పట్టు వదలకుండా పోరాడాడు. అయితే ఒక్కసారిగా కింగ్ కోహ్లీ టచ్‌లోకి వచ్చాడు. 2022 నుంచి ప్రపంచ క్రికెట్‌లో మరోసారి కింగ్ బ్యాట్ మోత మోగించింది. ప్రతి ప్రధాన ఐసీసీ ఈవెంట్‌లో అతను అగ్రస్థానంలో ఉన్నాడు.
2022 నుంచి విరాట్ కోహ్లీ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ అతని బ్యాట్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఈ సమయంలో 2022 ఆసియా కప్‌లో భారత్ తరఫున విరాట్ కోహ్లీనే అత్యధిక పరుగులు చేశాడు. అదే సమయంలో అతను 2022 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా. ఇది మాత్రమే కాకుండా 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. అలాగే ఐపీఎల్ 2023లో కూడా అదరగొట్టే ప్రదర్శన చేస్తున్నాడు.
ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్
ఐపీఎల్ 2023లో కింగ్ కోహ్లీ తన పాత స్టైల్‌లో కనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతని బ్యాట్ నుంచి చాలా పరుగులు వచ్చాయి. అతను ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. ఐపీఎల్ 2023లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు ఐదు అర్ధ సెంచరీలు చేశాడు.
రెండో అత్యధిక పరుగుల స్కోరర్
ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్‌లోని ఎనిమిది మ్యాచ్‌ల్లో విరాట్ 47.57 సగటుతో, 142.31 స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 31 ఫోర్లు, 11 సిక్సర్లు వచ్చాయి.
విశేషమేమిటంటే 2019 నుంచి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేదు. దీని గురించి అతను చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే 2022, 2023లో అతను విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చాడు. ఈ సమయంలో అతను వన్డే, టీ20 ఇంటర్నేషనల్, టెస్టులు ఇలా మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించాడు.
టీమిండియా మాజీ సారథి, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దూకుడెక్కువ. ఫీల్డ్‌లో కోహ్లీ అగ్రెసివ్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుండగా ఎవరైనా బ్యాటర్ అవుట్ అయితే అతడి సెలబ్రేషన్స్ కూడా దూకుడుగా ఉంటుంది. డేవిడ్ వార్నర్ డకౌట్ అయినా జోష్ హెజిల్‌వుడ్ నిష్క్రమించినా కోహ్లీ అగ్రెసివ్‌నెస్ మారదు. ఇది కొన్నిసార్లు అతడికి చేటు చేసినా అతడు మాత్రం దీనిని వీడలేదు. తాజాగా ఇదే దూకుడు వైఖరి కారణంగా కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు గాను అతడికి జరిమానా విధించింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో సోమవారం రాత్రి ముగిసిన మ్యాచ్ తర్వాత ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో కోహ్లీపై ఎందుకు జరిమానా విధించారో ప్రత్యేకించి వివరణ ఇవ్వలేదు. ‘ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నాం. కోహ్లీ ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.2 ను ఉల్లంఘించినందుకు గాను లెవల్ 1 అఫెన్స్ కింద అతడికి ఫైన్ విధించాం’అని ప్రకటనలో పేర్కొంది.