India Vs Australia ODI Series: ఆస్ట్రేలియాకు భారీ షాక్, భారత్‌తో వన్డే సిరీస్ నుంచి కామెరాన్ గ్రీన్ ఔట్, జట్టులోకి స్టార్ ప్లేయర్
భారత్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ. గాయం కారణంగా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ సిరీస్ నుంచి అవుట్.

భారత్ తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి 2 రోజుల ముందు ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా సిరీస్ నుండి వైదొలిగాడు. అతడి స్థానంలో వన్డే సిరీస్ కోసం మార్నస్ లాబుషేన్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నారు.
గాయం కారణంగా కామెరూన్ గ్రీన్ దూరం
కండరాల గాయం వల్ల కామెరూన్ గ్రీన్ భారత్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా సెలెక్టర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో "కామెరాన్ గ్రీన్ కొంతకాలం పాటు రెస్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌కు సిద్ధం కావడానికి షెఫీల్డ్ షీల్డ్ మూడో రౌండ్‌లో ఆడటానికి అవకాశం ఉంటుందని'' ఆసీస్ మేనేేజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మార్నస్ లాబుషేన్‌కు అవకాశం
కామెరూన్ గ్రీన్ స్థానంలో మార్నస్ లాబుషేన్‌ను ఆస్ట్రేలియా వన్డే జట్టులోకి తీసుకున్నారు. గురువారం క్వీన్స్‌లాండ్ తరపున షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. దేశవాళీ సీజన్‌లో లాబుషేన్ కు ఇది నాల్గవ సెంచరీ. 31 ఏళ్ల లాబుషేన్ 66 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో ఆసీస్‌కు ఆడాడు. ఇందులో 34.64 సగటుతో, 83.56 స్ట్రైక్ రేట్‌తో 1871 పరుగులు సాధించాడు. లబుషేన్ భారత్‌తో 15 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, అందులో 13 ఇన్నింగ్స్‌లలో 474 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉన్నాయి. లాబుషేన్ 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై 58 పరుగులు చేశాడు.
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ జట్టు
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కోనోలీ, అలెక్స్ కేరీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లాబుషేన్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, మాట్ రెన్‌షా, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్. మాథ్యూ కునెమాన్, జోష్ ఫిలిప్.
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్
- మొదటి వన్డే - అక్టోబర్ 19వ తేదీన (పెర్త్)
- రెండవ వన్డే - అక్టోబర్ 23వ తేదీన (అడిలైడ్)
- మూడవ వన్డే - అక్టోబర్ 25వ తేదీన (సిడ్నీ)
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లోని 3 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం 8:30 గంటలకు కెప్టెన్లు టాస్‌కు వస్తారు.





















