అన్వేషించండి

AUS Vs NED: ప్రపంచకప్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయం, ఆసిస్‌ ధాటికి 90 రన్స్ కే నెదర్లాండ్స్‌ చిత్తు

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అయిదు సార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియా... నెదర్లాండ్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది.

ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అయిదు సార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియా... నెదర్లాండ్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సునామీల డచ్‌ జట్టుపై విరుచుకుపడిన వేళ... ఆ జట్టు  పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచకప్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. డచ్‌ జట్టుపై అత్యంత భారీ తేడాతో విజయం సాధించి రన్‌ రేట్‌ను కంగారులు భారీగా మెరుగు పర్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌... గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, వార్నర్‌ శతకాలతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌   21 ఓవర్లలో  కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 309 పరుగుల భారీ తేడాతో కంగారులు ఘన విజయం సాధించారు.
 
ఈ ప్రపంచకప్‌లో ఆరంభంలో తడబడ్డా తర్వాత వరుస విజయాలతో ఊపుమీదున్న కంగారులు... డచ్‌ జట్టుపైనా ఘన విజయం సాధించారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రపంచకప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో మ్యాక్స్‌ వెల్‌ 106 పరుగులు చేశాడు. గ్లెన్‌ చేసిన 106 పరుగుల్లో 84 రన్స్‌ బౌండరీల రూపంలోనే వచ్చాయంటే విధ్వంసం ఎలా సాగిందో చెప్పొచ్చు. మ్యాక్స్‌ వెల్‌ విధ్వంసకర శతకానికి తోడు పాకిస్థాన్‌పై భారీ సెంచరీతో చెలరేగిన డేవిడ్‌ బాయ్‌... ఈ మ్యాచ్‌లోనూ శతక నాదం చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. వార్నర్‌కు తోడుగా స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ కూడా రాణించడంతో కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. 
 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. కానీ స్టీవ్‌ స్మిత్‌తో కలిసి డేవిడ్‌ బాయ్‌ భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ దిశగా సాగుతున్న స్టీవ్‌ స్మిత్‌ను 71 పరుగుల వద్ద ఆర్యన్‌ దత్త్‌ అవుట్‌ చేశాడు. 68 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సుతో స్మిత్‌ 71 పరుగులు చేశాడు. 160 పరుగుల వద్ద కంగారు జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. స్మిత్‌ అవుటైనా లబుషేన్‌తో కలిసి వార్నర్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వార్నర్‌ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి వాన్‌ బీక్‌ బౌలింగ్‌ అవుట్‌ అయ్యాడు. వరుసగా రెండో శతకం సాధించి వార్నర్‌ సత్తా చాటాడు. లబుషేన్‌ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో లబుషేన్‌ 62 పరుగులు చేశాడు. 
 
మ్యాక్స్‌వెల్‌ వచ్చాక మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ భారీ ఇన్నింగ్స్‌ ఆడని మ్యాక్స్‌వెల్‌.... సునామీలా డచ్‌ జట్టుపై విరుచుకుపడ్డాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లను  ఊచకోత కోశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాది పడేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. మ్యాక్స్‌ వెల్‌ సునామీ ఇన్నింగ్స్‌కు ఆస్ట్రేలియా స్కోరు బోర్డు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. కేవలం 44 బంతులో ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్‌ 9 ఫోర్లు, 8 సిక్సులతో 106 పరుగులు చేశాడు. అసలు 350 అయినా దాటుతుందా అన్న కంగారుల స్కోరు బోర్డు... గ్లెన్‌ విధ్వంసంతో 399 పరుగులకు చేరింది. డచ్‌  బౌలర్లలో వాన్‌బీక్‌ ఒక్కడే నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు వణికించారు. 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన డచ్‌ జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆడమ్‌ జంపా మరోసారి నాలుగు వికెట్లతో నెదర్సాండ్స్‌ పతనాన్ని శాసించాడు. నెదర్లాండ్స్‌ బ్యాటర్లు ఆరుగురు... కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. డచ్‌ బ్యాటర్లలో అత్యధిక స్కోరు 25 పరుగులే కావడం గమనార్హం. విక్రమ్‌జిత్‌ సింగ్‌ తప్ప మరే బ్యాట్స్‌మెన్‌ కనీసం 15 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దీంతో కేవలం 21 ఓవర్లలో 90 పరుగులకే నెదర్లాండ్స్‌ పని అయిపోయింది,.

టాప్ హెడ్ లైన్స్

Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget